టాలీవుడ్ హీరోల్లో దాదాపు గా ప్రతీ ఒక్కరు ఎదో ఒక సమయంలో వేరే భాషల్లో హిట్లుగా నిలిచిన సినిమా లను తెలుగు లో రీమేక్ చేశారు. ఇందు లో కొందరు మాత్రమే సక్సెస్ అయితే చాలా మంది ఫ్లాఫ్ అయ్యారు. ఒకప్పుడు సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ వరుస గా రీమేక్ సినిమా లు చేస్తూ సేఫ్ జోన్ వరుస గా సూపర్ హిట్ల ను అందుకునేవాడు. ఇప్పుడు కూడా ఆ ట్రెండ్ కొనసాగుతుండగా….
మిగిలిన సీనియర్ హీరోలు కూడా అడపా దడపా రీమేక్ లు చేశారు, రీసెంట్ టైం లో మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ రీమేక్ తోనే అవ్వగా ఇప్పుడు వరుస పెట్టి లూసిఫర్, వేదాలం రీమేక్ లు చేస్తున్నారు. మిగిలిన సీనియర్ హీరోలు ఈ మధ్య పెద్దగా రీమేక్ లు చేయలేదు.
ఇక మన ప్రజెంట్ స్టార్ హీరోల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ తమిళ్ ఖుషీ ని తెలుగు లో రీమేక్ చేయగా తర్వాత సల్మన్ ఖాన్ దబాంగ్ సినిమాను తెలుగు లో గబ్బర్ సింగ్ తో రీమేక్చేశాడు, తర్వాత తమిళ్ వీరం సినిమాను కాటమరాయుడు పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. రీసెంట్ గా హిందీ పింక్ ని తెలుగు లో వకీల్ సాబ్ గా రీమేక్ చేశాడు పవన్ కళ్యాణ్…
ఇక ఎన్టీఆర్ కన్నడ దుర్గి సినిమాను తెలుగు లో నరసింహుడు పేరుతో రీమేక్ చేయగా తర్వాత రీమేక్స్ జోలికి వెళ్ళలేదు…ఇక ప్రభాస్ కన్నడలో తెరకెక్కిన యోగి సినిమాను అదే పేరుతో తెలుగు లో యోగిగా రీమేక్ చేశాడు… ఇక రామ్ చరణ్ అమితాబ్ నటించిన జంజీర్ సినిమాను హిందీ తెలుగు లో ఒకే టైములో జంజీర్/తూఫాన్ పేరుతో రీమేక్ చేశారు…
కానీ రీమేక్ లలో పవన్ కి కలిసివచ్చినట్లు ఇతర హీరోలకు పెద్దగా కలిసి రాలేదు… ఇక రీమేక్ ల జోలికి వెళ్ళని వాళ్ళు ఇద్దరు… ఆ ఇద్దరే సూపర్ స్టార్ మహేష్ బాబు-స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్. మహేష్ రీమేక్ సినిమాలను డైరెక్ట్ గానే చేయను అని అనౌన్స్ చేయగా అల్లుఅర్జున్ ఇప్పటివరకు ఎందుకనో రీమేక్ పై ఎందుకనో తన అభిప్రాయాన్ని చెప్పలేదు. దాంతో ఈ యంగ్ జనరేషన్ లో ఈ ఇద్దరు మాత్రమే రీమేక్ లకు దూరం ఉంటూ తమ మార్క్ ని నిలుపుకుంటున్నారు.