బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే నెల 12న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు(HariHara VeeraMallu) మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి కానీ ఎప్పటి నుండో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ రావాడంతో బజ్ అయితే తగ్గింది.
కానీ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది ఇప్పుడు మేకర్స్ ప్రమోషన్స్ పనులు మరింతగా పెంచగా సినిమాలో బాలెన్స్ సాంగ్స్ ను కూడా రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. రీసెంట్ గా సినిమా నుండి మూడో సాంగ్ రిలీజ్ అవ్వగా ఇప్పుడు సినిమాలో నాలుగో సాంగ్ ను రిలీజ్ చేశారు.
నిదీ అగర్వాల్ మీద తీసిన తారా తారా అనే లిరిక్ తో వచ్చిన ఈ సాంగ్ ఫస్ట్ హియరింగ్ లోనే మెప్పించింది అని చెప్పాలి. ఎం ఎం కీరవాణి అందించిన మ్యూజిక్ మరోసారి ఆకట్టుకోగా విజువల్స్ సాంగ్స్ లో చూపించినవి చాలా రిచ్ గానే మెప్పించాయి…
లిరిక్స్ కూడా క్యాచీగా ఉండగా థియేటర్స్ లో చూసినప్పుడు ఇంకా బెటర్ ఎక్స్ పీరియన్స్ తో ఈ సాంగ్ మెప్పించే అవకాశం ఉంది. కచ్చితంగా మాస్ ఆడియన్స్ కి సాంగ్ ఇంకా ఎక్కువగా నచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్…
అన్నీ కూడా పర్వాలేదు అనిపించేలా ఉండగా మాస్ ని మెప్పించే అవకాశం ఈ సాంగ్ కి కొంచం ఎక్కువగా ఉందని చెప్పాలి. సాంగ్ లో పవన్ కళ్యాణ్ కొంత టైం తర్వాత ఎంటర్ అవ్వగా తన సింపుల్ స్టెప్స్ కూడా బాగానే మెప్పించే అవకాశం ఉందని చెప్పాలి.
ఓవరాల్ గా సాంగ్ సినిమా మీద ఉన్న అంచనాలను చాలా వరకు పెంచేసింది. ఇక సినిమా థియేట్రికల్ ట్రైలర్ త్వరలో రిలీజ్ కానుండగా ట్రైలర్ కూడా బాగా కట్ చేస్తే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ తన సత్తా చాటే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి.