ఎప్పుడో ఆడియన్స్ ముందుకు రావాల్సిన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు(HariHara VeeraMallu) సినిమా ఎట్టకేలకు ఈ నెల 12న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా, సినిమా చాలా డిలే అవ్వడంతో ఆడియన్స్ లో కొంత బజ్ తగ్గింది కానీ…
పవన్ కళ్యాణ్ సినిమా అవ్వడంతో రిలీజ్ టైంకి పరిస్థితులు అన్నీ కూడా సెట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా బిజినెస్ పరంగా మాత్రం చాలా రోజుల డిలే వల్ల బయర్స్ లో కూడా సినిమా ఎలా ఉంటుందో అన్న డౌట్స్ నెలకొనడంతో మరీ నిర్మాతలు అడిగిన..
మొత్తాన్ని ఇవ్వడానికి అంత సిద్ధంగా లేరు ప్రస్తుతానికి…సినిమా నిర్మాతలు చాలా ఏరియాల్లో సినిమా ప్రజెంట్ బజ్ కి మించి అత్యంత భారీ రేట్స్ ను కోట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రాయలసీమ ఏరియాలో ఈ సినిమా కి నిర్మాతలు ఆల్ మోస్ట్ 26-28 కోట్ల రేంజ్ లో…
రేట్స్ ను కోట్ చేస్తున్నారట…ఆ రేట్స్ చూసి బయర్స్ అంత పెట్టడానికి ప్రస్తుతానికి సిద్ధంగా లేరని తెలుస్తుంది. సినిమా ప్రజెంట్ బజ్ దృశ్యా 18-20 కోట్ల లోపు డీల్ ను క్లోజ్ చేయడానికి కొన్ని ప్రపోజల్స్ వచ్చినట్లు తెలుస్తూ ఉండగా మేకర్స్ సినిమా ఔట్ పుట్ మీద నమ్మకంతో…
రేట్స్ విషయంలో తగ్గడం లేదట…కానీ మేకర్స్ అడిగిన రేట్స్ ఇవ్వడానికి బయర్స్ ముందుకు రావాలి అంటే సినిమా ట్రైలర్ ఇప్పుడు ఓ రేంజ్ లో క్లిక్ అవ్వాల్సిన అవసరం ఉంది, ఆ రేంజ్ లో సినిమా ట్రైలర్ కుమ్మేస్తేనే బిజినెస్ పరంగా భారీ రేట్స్ పెట్టి కొనడానికి…
బయర్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది… ఓవరాల్ గా చాలా ఏళ్ళుగా డిలే అయిన ఈ ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మ్యాజిక్ చేసినా అది కేవలం పవన్ కళ్యాణ్ పేరు మీదే కాబట్టి…చాలా ఏళ్ల తర్వాత స్ట్రైట్ మూవీతో వస్తున్న పవర్ స్టార్ ఏ రేంజ్ లో పవర్ ను చూపెడుతాడో చూడాలి.
Ye kumpa munagadu distributor kompa mod*** a kudsi pothundi