నార్మల్ టైంలో అయితే టాప్ స్టార్ నటించిన సినిమా వస్తుంది అంటే ఆ బజ్ అండ్ క్రేజ్ మరో లెవల్ లో ఉంటాయి…లేటెస్ట్ గా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు(HariHara VeeraMallu) ఆడియన్స్ ముందుకు జూన్ 12న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…
ఆల్ మోస్ట్ 5 ఏళ్ళుగా షూటింగ్ జరుపుకున్న సినిమా ఇది…అలాగే అనేక సార్లు పోస్ట్ పోన్ అయ్యి ఎట్టకేలకు అనేక అవరోధాలను ఫేస్ చేసి ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. దాంతో బజ్ కొంచం అనుకున్న రేంజ్ లో అయితే లేదనే చెప్పాలి.
ఎంత పవర్ స్టార్ మూవీ అయినా ఫ్యాన్స్ వరకు ఎలా ఉన్నా కూడా కామన్ ఆడియన్స్ లో ఈ సినిమా మీద ప్రస్తుతానికి బజ్ అయితే ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పటి వరకు సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ గా సాంగ్స్ ను మాత్రమే రిలీజ్ చేయగా…
అవి పర్వాలేదు అనిపించినా గ్రౌండ్ లెవల్ లో మంచి రీచ్ ని అయితే సొంతం చేసుకోలేదు, అలా అని పవన్ క్రేజ్ తగ్గిందా అంటే ఈ సినిమా తర్వాత వచ్చే ఓజీ సినిమా గురించిన ఏ చిన్న అప్ డేట్ అయినా కూడా ఫ్యాన్స్ నే కాదు కామన్ ఆడియన్స్ ను కూడా ఓ రేంజ్ లో ఎక్సైట్ చేస్తుంది.
కానీ ఈ సినిమా మరీ లేట్ అయిపోవడంతో బజ్ బాగా స్లో అవ్వగా మేకర్స్ బిజినెస్ విషయంలో కోట్ చేస్తున్న రేట్స్ చూసి కూడా బయర్స్ ఆ రేట్స్ ఇవ్వడానికి సిద్ధపడటం లేదు, కానీ ఓజీ విషయంలో ఇప్పుడే బిజినెస్ అయ్యే రేంజ్ లో క్రేజ్ ఉంది..
దాంతో ఇప్పటికిప్పుడు సినిమా మీద బజ్ పెరగాలి అంటే సాలిడ్ ట్రైలర్ ను రిలీజ్ చేయాల్సి ఉంటుంది…ఆ ట్రైలర్ ఎలా ఉండాలి అంటే ఓవర్ నైట్ లో సినిమా మీద క్రేజ్ పెరిగే రేంజ్ లో కట్ ఉంటేనే సినిమా మీద క్రేజ్ పెరుగుతుంది. మరి మేకర్స్ ట్రైలర్ విషయంలో మరీ లేట్ చేస్తారా లేక త్వరలో రిలీజ్ చేస్తారో చూడాలి.