బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైం తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు(HariHara VeeraMallu) సినిమా ఆడియన్స్ ముందుకు ఈ నెల లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు…
పెద్దగా అంచనాలు లేక పోయినా కూడా ట్రైలర్ తర్వాత సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు సాలిడ్ గా పెరిగి పోయాయి అనే చెప్పాలి ఇప్పుడు…ట్రైలర్ కూడా టాలీవుడ్ పరంగానే కాకుండా ఏకంగా సౌత్ మూవీస్ పరంగా కూడా ఆల్ టైం రికార్డ్ వ్యూస్ ను సొంతం చేసుకుని…
సంచలనం సృష్టించడం విశేషం అయితే…ఇలా ఆల్ టైం రికార్డులు కొట్టిన ఏ ట్రైలర్స్ అయినా కూడా ఫస్ట్ డే రికార్డ్ తర్వాత రోజుల్లో కూడా మంచి వ్యూవర్ షిప్ నే సొంతం చేసుకుంటూ ఉంటాయి…కానీ ఆశ్యర్యంగా హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ విషయంలో మాత్రం…
చూసుకుంటే మొదటి రోజు ఆల్ టైం రికార్డ్ లెవల్ లో 47 మిలియన్స్ కి పైగా వ్యూస్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన తర్వాత మిగిలిన 2 రోజుల్లో చూసుకుంటే మాత్రం బిలో 3 మిలియన్స్ రేంజ్ లోపే వ్యూస్ ని సొంతం చేసుకుని…
పెద్దగా హోల్డ్ ని చూపించ లేక పోయింది…ఇలాంటి రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ తర్వాత మినిమమ్ 10-12 మిలియన్స్ రేంజ్ లో వ్యూస్ ఇతర బిగ్ మూవీస్ కి సొంతం అయ్యాయి రీసెంట్ టైంలో… కానీ హరిహర వీరమల్లు ట్రైలర్ యూట్యూబ్ లో…
టాప్ ప్లేస్ లో ట్రెండ్ కూడా ఒక రోజు వరకు మాత్రమే ఉండగా వ్యూస్ కూడా తర్వాత రోజుల్లో అనుకున్న రేంజ్ లో రాలేదు….కానీ ఓవరాల్ గా ఫస్ట్ డే రికార్డులే ముఖ్యం కాబట్టి సినిమా కి ఇప్పుడు పెరిగిన బజ్ దృశ్యా టాక్ కూడా బాగుంటే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ లేపే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి.