బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ ఈ నెల 24న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు(HariHara VeeraMallu) సినిమా అనేక సార్లు పోస్ట్ పోన్ అవ్వడం లేట్ అవ్వడంతో అనుకున్న రేంజ్ లో బజ్ అయితే సినిమా మీద…
ఏర్పడలేదు కానీ సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి అనే చెప్పాలి. ఇక ట్రైలర్ యూట్యూబ్ లో సాలిడ్ గా రికార్డ్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. టాలీవుడ్ రికార్డే కాదు ఏకంగా సౌత్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకోగా…
ఓవరాల్ గా సినిమా ట్రైలర్ 24 గంటల్లో వ్యూస్ పరంగా ఎపిక్ రికార్డ్ కొడుతూ 47.02 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకోగా లైక్స్ పరంగా మాత్రం 718.7K లైక్స్ ని అందుకుని టాప్ 10 లో కూడా ఎంటర్ అవ్వలేక పోయింది. కానీ వ్యూస్ మాత్రం ఎపిక్ రికార్డులతో దుమ్ము లేపింది.
ఒకసారి టాలీవుడ్ ట్రైలర్ రికార్డ్స్ ను గమనిస్తే…
Tollywood Highest viewed trailers in 24 hrs…
👉#HariHaraVeeraMallu – 47.02M~💥💥💥💥💥💥
👉#Pushpa2TheRule Trailer(Telugu) – 44.67M
👉#GunturKaaram – 37.68M
👉#GameChanger – 36.24M
👉#Salaar – 32.58M
👉#SarkaruVaariPaata – 26.77M
👉#RadheShyam – 23.20M
👉#Acharya : 21.86M
👉#Baahubali2 trailer : 21.81M
👉#Salaar Release Trailer – 21.70M
👉#HIT3 Trailer(Telugu) – 21.36M
👉#RRRMovie – 20.45M
ఇక సౌత్ టాప్ ట్రైలర్ రికార్డులను గమనిస్తే…
South Most viewed Trailers in 24 Hours
👉#HariHaraVeeraMallu – 47.02M~💥💥💥💥💥💥
👉#Pushpa2TheRule Trailer(Telugu) – 44.67M
👉#GunturKaaram – 37.68M
👉#GameChanger – 36.24M
👉#Salaar – 32.58M
👉#LEO Trailer – 31.91M
👉#TheGOAT Trailer(Tamil) – 29.28M
👉#Beast – 29.08M
👉#SarkaruVaariPaata: 26.77M
👉#Thunivu – 24.96M
👉#RadheShyam – 23.20M
ఓవరాల్ గా సినిమా ట్రైలర్ ఇప్పటి వరకు ఉన్న అంచనాలను అన్నీ మించిపోయి సినిమా మీద మళ్ళీ ఎక్స్ పెర్టేషన్స్ భారీగా పెరిగేలా చేసింది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక టాక్ కూడా ఇదే రేంజ్ లో కనుక సొంతం అయితే ఇక పవర్ స్టార్ మాస్ రాంపెజ్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించే అవకాశం ఎంతైనా ఉంది.