నిఖిల్ సిద్దార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ2 సినిమా రిలీజ్ పై సందేహాలు ఉండేవి, అన్ని సినిమాల పోటి నడుమ ఈ సినిమా కి థియేటర్స్ దొరుకుతాయో లేవో అని, అనుకున్నట్లే చాలా లిమిటెడ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆడియన్స్ నుండి విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ కూడా చాలా లిమిటెడ్ గా థియేటర్స్ ఇంక్రీస్ అయ్యాయి. అదే సమయంలో హిందీలో సినిమా కచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనుకోగా…
ఆల్ రెడీ లాల్ సింగ్ చడ్డా మరియు రక్షా భందన్ సినిమాల రిలీజ్ వలన అసలు ఏమాత్రం షోలు ఈ సినిమాకి దక్కలేదు. కానీ సినిమాకి వచ్చిన టాక్ దృశ్యా ఎలాగోలా మొదటి రోజు 50-60 వరకు షోలను ఈ సినిమాకి కేటాయించారు.
రెండో రోజు నుండి టాక్ అంతటా స్ప్రెడ్ అవ్వడంతో ఆడియన్స్ నుండి విపరీతమైన డిమాండ్ ఏర్పడగా వేరే సినిమాలు ఆకట్టుకునేలా లేక పోవడం, ఈ సినిమా కోసం సడెన్ ఆసక్తి పెరగడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర డిమాండ్ చూసి ఎట్టకేలకు స్క్రీన్స్ ను పెంచక తప్పలేదు బాలీవుడ్ లో… తొలిరోజు అతి కష్టం మీద 60 స్క్రీన్స్ లో…
రిలీజ్ అయిన కార్తికేయ2 సినిమా రెండో రోజు ఆల్ మోస్ట్ 300 వరకు స్క్రీన్స్ ను పెంచుకుంటే మూడో రోజు ఏకంగా 600 స్క్రీన్స్ లో రన్ అవుతుంది, స్క్రీన్స్ ను డిమాండ్ ఉన్న ప్రతీ చోట పెంచడం మొదలు పెట్టగా ఫైనల్ స్క్రీన్ కౌంట్ ఇప్పుడు ఏకంగా 1000 రేంజ్ లో ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి…. ఇక సినిమా హిందీ లో ఫస్ట్ డే ఫైనల్ గా 9 లక్షల గ్రాస్ ను అందుకుంటే…
రెండో రోజు 40 లక్షల దాకా గ్రాస్ ను అందుకుందని సమాచారం, మూడో రోజు అవలీలగా 1 కోటి రేంజ్ దాకా గ్రాస్ సొంతం అయ్యే అవకాశం ఉందని అంటూ ఉండగా మరో రెండు వారాలు అక్కడ సినిమాలు ఏమి లేక పోవడంతో లాంగ్ రన్ లో మరింత జోరు ని సినిమా అక్కడ చూపించే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.