టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ తెలుగు తో పాటు హిందీ లో కూడా ఒకేసారి రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాగా అక్కడ సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ హెల్ప్ తో థియేటర్స్ కూడా బాగానే సొంతం చేసుకున్న సినిమా ఉన్నంతలో మరీ అద్బుతం కాదు కానీ డీసెంట్ కలెక్షన్స్ తోనే పరుగును కొనసాగిస్తూ ఇప్పుడు 10 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోవడానికి సిద్ధం అవుతుంది.
సినిమా అక్కడ మొత్తం మీద 10 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి 9.40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా అందులో నుండి ఓవరాల్ షేర్ 4.40 కోట్ల దాకా సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇక సినిమా టోటల్ గా హిందీ అండ్…
రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 10 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి 4.80 కోట్ల షేర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా బిజినెస్ వాల్యూ 5.50 కోట్ల రేంజ్ లో ఉండగా ఆ మార్క్ ని అందుకోవడానికి సినిమా ఈ వీకెండ్ లో…
బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తే ఆ టార్గెట్ ను అందుకునే అవకాశం ఉంది, సినిమా కి ఉన్నంతలో హిందీ లో మంచి కలెక్షన్స్ లభించాయి అని చెప్పాలి కానీ ఇంకొంచం ప్రమోట్ చేసి ఉంటె ఇంకా బెటర్ గా సినిమాకి అక్కడ కలెక్షన్స్ సొంతం అయ్యి ఉండేవి.