బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరోలలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ను సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ కెరీర్ 2017 టైం లో పీక్ కి వెళ్ళింది, ఆ ఇయర్ నేను లోకల్, నిన్ను కోరి మరియు MCA సినిమాలు ఒకటికి మించి ఒకటి హిట్ అయ్యి నాని ని మీడియం రేంజ్ హీరోల్లో నంబర్ 1 హీరోగా మారేలా చేశాయి. కానీ తర్వాత నుండే అసలు సమస్యలు మొదలు అయ్యాయి.
నాని తన రేంజ్ లోనే డిఫెరెంట్ జానర్ మూవీస్ ని ట్రై చేస్తూ సినిమాలను చేస్తూ వచ్చాడు, కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచిన తర్వాత నాని నుండి వి ది మూవీ అండ్ టక్ జగదీశ్ లాంటి సినిమాలు….
డిజిటల్ లో రిలీజ్ అవ్వాల్సి వచ్చింది ఆ సినిమాల ఇంపాక్ట్ ఆడియన్స్ లో గట్టిగానే పడగా నాని సినిమాలు త్వరగానే డిజిటల్ లో వస్తాయన్న బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అయింది. తర్వాత చేసిన శ్యామ్ సింగ రాయ్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి యునానిమస్ రెస్పాన్స్ తో బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంది….
ఇక ఈ సినిమా తర్వాత నాని చేసిన అంటే సుందరానికీ నానికి తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అని అందరూ అనుకోగా సినిమా రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా ఏ దశలో కూడా బిజినెస్ ను అందుకునే దిశగా అడుగులు వేయలేక పోతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
31 కోట్ల టార్గెట్ ను అందుకునే అవకాశం అయితే ఇక లేనట్లే అంటున్నారు ట్రేడ్ వర్గాలు… సినిమా సూపర్ హిట్ టాక్ తో వర్కింగ్ డేస్ లో భారీగా డ్రాప్ అయ్యి ఫ్లాఫ్ దిశగా అడుగులు వేస్తూ ఉండటం విచారకరం అని చెప్పాలి. ఇక నాని కి ఈ ఇయర్ దసరా సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది, ఆ సినిమా భారీ కంబ్యాక్ సొంతం అవ్వాలని కోరుకుందాం….