బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల పరంగా సాలిడ్ హిట్స్ తో హాట్రిక్ విజయాలను సొంతం చేసుకుని కెరీర్ బెత ఫామ్ తో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా…
సినిమా మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ ని దాటేసి ఓవరాల్ గా లాభాలలోకి ఎంటర్ అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో మేజర్ ఏరియాల్లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా…నైజాంలో 13 కోట్ల బిజినెస్ మీద 16 కోట్లకు పైగా షేర్ ని…
అందుకోగా కోస్టల్ ఆంధ్ర రీజన్ లో 15 కోట్ల బిజినెస్ ను 10వ రోజున సాధించిన కలెక్షన్స్ తో దాటేసిన సినిమా 11వ రోజు కలెక్షన్స్ తో లాభాలను కూడా సొంతం చేసుకోబోతుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో 5.50 కోట్ల బిజినెస్ ను దాటేసి లాభాలను అందుకున్న సినిమా…
ఓవర్సీస్ లో 10 కోట్ల బిజినెస్ మీద ఓవరాల్ గా 12 కోట్లకు పైగా షేర్ ని అందుకుని మంచి లాభాలను అక్కడ కూడా అందుకుంది. కానీ సినిమా రాయలసీమ రీజన్ లో 5.40 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా….ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో…
4.8 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 5.5 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా మరో 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా ఒక్క సీడెడ్ తప్పితే మిగిలిన ఏరియాలు అన్నీ కూడా….
బ్రేక్ ఈవెన్ ని అందుకోగా మిగిలిన రన్ లో ఇక్కడ మిగిలిన అమౌంట్ ని ఎంతవరకు అందుకుంటుందో చూడాలి… కానీ సినిమా ఇక లాంగ్ రన్ లో ఆ ఒక్క ఏరియాలో కూడా టార్గెట్ ను అందుకుంటుందో లేదో వర్కింగ్ డేస్ హోల్డ్ ని బట్టి తెలుస్తుంది అని చెప్పాలి…