Home న్యూస్ హిట్3 టీసర్ రివ్యూ…నాని ఊచకోత…ఇది అస్సలు ఊహించలేదు!!

హిట్3 టీసర్ రివ్యూ…నాని ఊచకోత…ఇది అస్సలు ఊహించలేదు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో సూపర్ ఫామ్ తో దూసుకు పోతున్న హీరో నాచురల్ స్టార్ నాని(Nani) కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న టైంలో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు హిట్ సిరీస్ లో భాగంగా మూడో పార్ట్ అయిన హిట్ 3 సర్కార్స్ లాఠీ(HIT 3 Teaser : Sarkaar’s Laathi) సినిమాతో ఆడియన్స్ ముందుకు ఈ సమ్మర్ లో…

గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా నాని పుట్టిన రోజు కానుకగా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేశారు ఇప్పుడు….హిట్ సిరీస్ కొంచం రా కంటెంట్ తో ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ నాని హిట్ 3 విషయంలో బ్రూటల్ మాస్ కంటెంట్ ని…

చూపించాడు టీసర్ లో… కోపం ఎక్కువ ఉండే వ్యక్తి అయిన పోలిస్ ఒక  సీరియస్ కిల్లర్ ని ఎలా పట్టుకున్నాడు… వరుస హత్యలకు పాల్పడుతున్న కిల్లర్ ని ఎలా ఆపాడు అన్న కాన్సెప్ట్ తో వస్తున్న హిట్ 3 టీసర్ లో నాని మాస్ క్యారెక్టర్ కానీ డైలాగ్స్ కానీ అన్నింటికీ మించి..

టీసర్ లో చూపించిన యాక్షన్ విజువల్స్ కానీ నాని కెరీర్ లోనే ఇది వరకు ఎప్పుడూ చేయని రేంజ్ లో ఉండటంతో టీసర్ చూసిన తర్వాత ఆడియన్స్ అందరూ ఆశ్యర్యపోవడం ఖాయమని చెప్పాలి. టీసర్ లో కొన్ని షాట్స్ మైండ్ బ్లాంక్ చేయగా….

అన్ని షాట్స్ ఒకెత్తు అయితే టీసర్ ఎండ్ సీన్ లో నాని ఉగ్రరూపం మరో ఎత్తు అని చెప్పాలి…రీసెంట్ టైంలో ఏ సినిమా లో కూడా ఇలాంటి వైల్డ్ షాట్స్ కనిపించలేదు తెలుగు లో…ఓవరాల్ గా హిట్ సిరీస్ లో మూడో పార్ట్ గా వస్తున్నా హిట్ 3 మొదటి 2 పార్టులను ఓ రేంజ్ లో….

మించి పోయేలా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ టీసర్ చూసిన తర్వాత… ఇక మే 1 న రిలీజ్ కాబోతున్న సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర నాని ఖాతాలో మరో భారీ హిట్ సమ్మర్ లో సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here