చప్పగా సాగుతున్న సమ్మర్ లో ఆడియన్స్ ని తిరిగి థియేటర్స్ కి భారీ ఎత్తున రప్పించిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా, అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. మరీ యునానిమస్ రెస్పాన్స్ ను ఏమి సొంతం చేసుకోకపోయినా కూడా నాని స్టార్ పవర్ హెల్ప్ తో సినిమా…
ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని దాటేసి మంచి ప్రాఫిట్స్ ను అందుకుని కుమ్మేసింది. ఇక కలెక్షన్స్ పరంగా నాని కెరీర్ బెస్ట్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమా లాంగ్ రన్ లో కూడా సాలిడ్ హోల్డ్ ని చూపించి కుమ్మేసిన సినిమా ఓవరాల్ గా గ్రాస్ పరంగా…
లాంగ్ రన్ లో కూడా కుమ్మేసిన హిట్3 తెలుగు రాష్ట్రాల్లో ఆవల బెటర్ గా ట్రెండ్ ను చూపించడంతో గ్రాస్ పరంగా నాని కెరీర్ బెస్ట్ గ్రాస్ ను సొంతం చేసుకుంది…దసరా 115 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటే ఇప్పటి వరకు హిట్3 మూవీ ఆల్ మోస్ట్…
118.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా షేర్ పరంగా మాత్రం నాని కెరీర్ బెస్ట్ షేర్ ని అందుకోవడానికి ఇంకా కోటికి పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. దసరా మూవీ టోటల్ రన్ లో 63.55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా….
హిట్3 మూవీ ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 62.50 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా దసరా షేర్ మార్క్ ని దాటాలి అంటే ఇంకో కోటికి పైగా షేర్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది… కానీ దసరాకి తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ కలెక్షన్స్ రాగా…
హిట్3 కి తెలుగు రాష్ట్రాల ఆవల బెటర్ కలెక్షన్స్ వచ్చాయి…కానీ ఇప్పుడు అక్కడ కూడా స్లో అయిన హిట్3 మేజర్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల నుండే రాబట్టాల్సిన అవసరం ఉంది. కానీ వచ్చే వారం కూడా పెద్దగా పోటి లేదు కాబట్టి సినిమా మిగిలిన రన్ లో ఈ మార్క్ ని అందుకుంటుందో లేదో చూడాలి ఇక…