ఒకప్పటి సమ్మర్ లతో పోల్చితే రీసెంట్ టైంలో సమ్మర్ సీజన్స్ చాలా చప్పగా సాగుతూ ఉండగా ఇప్పుడు టాలీవుడ్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ట్రేడ్ లో ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉండగా…
వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 750 కి పైగానే థియేటర్స్ లో రిలీజ్ కానుండగా వరల్డ్ వైడ్ గా 2000 వరకు థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్…
ఒక్క ఆంధ్ర లో టికెట్ హైక్స్ పర్మీషన్ కోసం లేట్ గా ఓపెన్ చేయగా మిగిలిన అన్ని చోట్లా సాలిడ్ ట్రెండ్ ను చూపించగా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతున్నాడు నాని. టోటల్ అడ్వాన్స్ టికెట్ సేల్స్ గ్రాస్ లెక్క…
12.5 కోట్ల మార్క్ ని అందుకోగా ఇక ఓపెనింగ్స్ పరంగా కూడా మాస్ కుమ్ముడు కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తుంది. సినిమా నైజాంలో ఎక్స్ లెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా ఆంధ్రలో ఇప్పుడే బుకింగ్స్ జోరు అందుకున్నాయి లేట్ ఓపెనింగ్ వల్ల…ఓవరాల్ గా ప్రజెంట్ ఊపుని చూస్తుంటే..
ఆంధ్రలో అనుకున్న రేంజ్ లో జోరు ఉంటే హిట్3 మూవీ తెలుగు రాష్ట్రాల్లో డబుల్ డిజిట్ షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో కొదొఆ సాలిడ్ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తూ ఉండటంతో..
వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 16-18 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక టాక్ యునానిమస్ లెవల్ లో కనుక ఉంటే ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక నాని బాక్స్ ఆఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తాడో చూడాలి.