Home న్యూస్ 4 డేస్ ముందే 3 కోట్లు ఔట్….మాస్ రచ్చ లేపబోతున్న నాని!!

4 డేస్ ముందే 3 కోట్లు ఔట్….మాస్ రచ్చ లేపబోతున్న నాని!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ చాలా చప్పగా సాగిపోతూ ఉండగా, టాలీవుడ్ తరుపున ఒక్క సినిమా కూడా అంచనాలను మించి దుమ్ము లేపపోయింది. ఇక ఏప్రిల్ నెలలో రిలీజ్ అయిన సినిమాలు ఒక్కటి కూడా డబుల్ డిజిట్ కలెక్షన్స్ ని కూడా అందుకోలేక పోయాయి. ఇలాంటి టైంలో ఆడియన్స్ ముందుకు మే 1 న ఇప్పుడు…

నాచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) తో సందడి చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆల్ రెడీ ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి…టాలీవుడ్ ఎదురుచూస్తున్న బిగ్ సమ్మర్ హిట్ గా ఈ సినిమా నిలుస్తుందని…

అందరూ ఆశిస్తూ ఉండగా, ఆ ఆశలను నిజం చేస్తూ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్లా మంచి జోరునే చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. నార్త్ అమెరికాలో సినిమా ప్రీ బుకింగ్స్ ను రీసెంట్ గా ఓపెన్ చేయగా అక్కడ ఇప్పటి వరకు…

2 లక్షల డాలర్స్ కి పైగా బుకింగ్స్ ను ఆల్ రెడీ సొంతం చేసుకున్న సినిమా, ఇండియాలో కూడా రీసెంట్ గా బుకింగ్స్ ను లిమిటెడ్ షోలకి ఓపెన్ చేయగా ఆల్ రెడీ ఇక్కడ 1 కోటికి పైగానే బుకింగ్స్ ను సొంతం చేసుకుని రచ్చ లేపుతూ ఉంది.

దాంతో మొదటి రోజుకి గాను సినిమా వరల్డ్ వైడ్ గా 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here