Home న్యూస్ ఇక ఆశలన్నీ హిట్3 మీదే….ఆంధ్ర బిజినెస్ రేటు ఎంతంటే!!

ఇక ఆశలన్నీ హిట్3 మీదే….ఆంధ్ర బిజినెస్ రేటు ఎంతంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో సమ్మర్ లో సినిమాలే రిలీజ్ అవ్వడం లేదు…రెండు మూడేళ్ళ టైంలో పెద్ద స్టార్స్ నటించిన సినిమాలు సమ్మర్ లో రిలీజ్ అవ్వడం తగ్గిపోగా…కొన్ని మంచి బజ్ ఉన్న సినిమాలు రిలీజ్ అయినా కూడా చాలా వరకు సినిమాలు ఇంపాక్ట్ ఏమి చూపించ లేక పోతున్నాయి…లాస్ట్ ఇయర్ సమ్మర్…

ఇలానే చాలా చప్పగా సాగిపోయింది. ఇక ఈ ఇయర్ సమ్మర్ లో వారం వారం ఏవో ఒక సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా అవి ఆడియన్స్ ను అనుకున్న రేంజ్ లో అలరించలేక పోతున్నాయి. దాంతో ఏప్రిల్ నెల పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించ లేక పోయింది ఇప్పటి వరకు…

ఇక వచ్చే వారంలో కొన్ని సినిమాలు రిలీజ్ కానుండగా వాటిలో ఎంతవరకు ఆడియన్స్ ను మెప్పించే సినిమాలు వస్తాయో చూడాలి. ఇక ఇప్పుడు టాలీవుడ్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నది మాత్రం మే 1 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) మీదే….

కాగా సినిమా ట్రైలర్ ఆడియన్స్ లో మంచి రీచ్ నే సొంతం చేసుకోగా సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఆల్ రెడీ బిజినెస్ పరంగా అన్ని ఏరియాల్లో నాని మీద నమ్మకంతో మంచి రేట్స్ ఇచ్చి…

సినిమా రైట్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా…ఆంధ్ర రీజన్ లో సినిమా కి బిజినెస్ క్లోజ్ అయింది…ఆల్ మోస్ట్ 15 కోట్ల రేంజ్ లో రేటు కి ఇక్కడ డీల్ క్లోజ్ అవ్వగా నాని ప్రీవియస్ మూవీ అయిన సరిపోదా శనివారం సినిమా ఇక్కడ…

12.5 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకుంది. ఆ సినిమాతో పోల్చితే కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన హిట్3 మూవీ కి సాలిడ్ రేటు సొంతం అయ్యింది అని చెప్పాలి. ఇక సమ్మర్ లో ఆడియన్స్ ని ఎంతవరకు హిట్3 థియేటర్స్ కి రప్పించగలుగుతుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here