బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా మంచి జోరుని చూపించిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా నాని కెరీర్ లో కూడా ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…
బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకున్న సినిమా రీసెంట్ గా డిజిటల్ లో కూడా రిలీజ్ అవ్వగా అక్కడ కూడా సాలిడ్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతూ ఉండగా మరో పక్క బాక్స్ ఆఫీస్ దగ్గర మేజర్ సెంటర్స్ లో మంచి జోరుని చూపించిన హిట్3 సినిమా…
నైజాంలో ఎక్స్ లెంట్ లాభాలను సొంతం చేసుకోగా రాయలసీమ ఏరియాలో కూడా రన్ ను కంప్లీట్ చేసుకోగా ఇక్కడ ఓవరాల్ గా 5.40 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా టోటల్ థియేట్రికల్ రన్ లో సాధించిన షేర్ అండ్ హైర్స్ తో కలిపి…
ఫైనల్ గా 5.20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది….మొత్తం మీద అన్ని మేజర్ సెంటర్స్ లో సినిమాకి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యి మంచి లాభాలు సొంతం అవ్వగా ఒక్క సీడెడ్ ఏరియాలో మాత్రమే సినిమా కి కొంత నష్టం సొంతం అయ్యింది.
అలాగే నాని నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ గా నిలిచినా కూడా సీడెడ్ ఏరియాలో మాత్రం లాసులను సొంతం చేసుకోగా ఇప్పుడు హిట్3 మూవీ కూడా ఇక్కడ కొంత లాస్ ను సొంతం చేసుకుని రన్ ను కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు.