బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ ఫామ్ తో దూసుకు పోతూ టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల్లో వరుస విజయాలతో దుమ్ము దుమారం లేపిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit3 Movie) ఈ సమ్మర్ లో టాలీవుడ్ తరుపున బిగ్ హిట్ గా నిలిచింది. సినిమా మీద మంచి అంచనాలు ఉండగా….
ఆ అంచనాలను ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను కూడా దక్కించుకుంది. ఆల్ మోస్ట్ 4 వారాల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ రన్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఒక్కో ఏరియాలో రన్ ని…
కంప్లీట్ చేసుకుంటూ ఉండగా లేటెస్ట్ గా నైజాం ఏరియాలో సినిమా రన్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యింది అని చెప్పాలి. నాని సినిమాలకు మొదటి నుండి నైజాంలో మంచి కలెక్షన్స్ సొంతం అవుతూ ఉండగా ఈ సినిమా ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్న వైలెంట్ మూవీ అని తెలిసినా కూడా….
ఆల్ మోస్ట్ 13 కోట్ల రేంజ్ లో రేటు చెల్లించి హక్కులు తీసుకోగా సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇక్కడ సాలిడ్ రికవరీని లాంగ్ రన్ లో సొంతం చేసుకుని బిజినెస్ మొత్తాన్ని రికవరీ చేసి కుమ్మేసింది. టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి నైజాం ఏరియాలో హిట్ 3 మూవీ…
18.82 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అంటే 13 కోట్ల బిజినెస్ మీద ఈ ఒక్క ఏరియా లోనే సినిమాకి 5.82 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ సొంతం అయ్యింది… ఇక నాని అప్ కమింగ్ ప్యారడైజ్ వచ్చే ఏడాది మరింత రచ్చ చేయడం ఖయామని చెప్పాలి.