Home న్యూస్ మొదటి రోజే ఇదేంటి సామి….హిట్3 కి మైండ్ బ్లాంక్ దెబ్బ ఇది!!

మొదటి రోజే ఇదేంటి సామి….హిట్3 కి మైండ్ బ్లాంక్ దెబ్బ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అసలే సమ్మర్ చాలా చప్పగా సాగుతూ ఒకటి తర్వాత ఒకటి నిరాశ పరిచే సినిమాలతో సతమతం అవుతూ ఉన్న టైంలో ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే భాద్యత తీసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమాతో మొదటి రోజు అందరి అంచనాలను మించిపోయాడు…

సినిమా సంక్రాంతి సీజన్ తర్వాత బెస్ట్ అనిపించే రేంజ్ లో ఫుల్స్ తో అన్ని చోట్లా మాస్ రచ్చ చేసింది. ఇక లాంగ్ వీకెండ్ లో వీర లెవల్ లో కుమ్మేయడం ఖాయమని అందరూ అనుకుంటూ ఉన్న టైంలో సడెన్ గా మొదటి రోజే సినిమాకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది..

ఏ సినిమా అయినా రిలీజ్ అయిన రోజునే ఆన్ లైన్ లో పైరసీ ప్రింట్స్ లాంటివి లీక్ అవ్వడం అన్నది ఎప్పటి నుండో జరుగుతూ ఉంది….కానీ హిట్3 సినిమా విషయంలో ఆల్ మోస్ట్ మాస్టర్ ప్రింట్ ను తలపించే రేంజ్ లో HD వర్షన్ ప్రింట్ ఆన్ లైన్ లో సాయంత్రానికే…

లీక్ అవ్వడం టోటల్ టాలీవుడ్ కే మైండ్ బ్లాంక్ చేసింది. రీసెంట్ గా కొన్ని బాలీవుడ్ సినిమాలకు అలాగే సౌత్ పాన్ ఇండియా సినిమాల విషయంలో ఇలా ప్రీ HD వర్షన్ ల లీక్ లు ఇబ్బంది పెట్టగా ఇప్పుడు అసలే సీజన్ లేని టైంలో ఒక మంచి రెవెన్యూని క్రియేట్ చేసేలా అనిపించిన…

హిట్3 సినిమా ప్రింట్ లీక్ అవ్వడం గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి….సినిమా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఎంత బాగున్నా కూడా ఆన్ లైన్ పైరసీ ప్రింట్స్ చూసే వాళ్ళు కూడా ఎక్కువే ఉండటంతో కచ్చితంగా ఫుట్ ఫాల్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది..

కానీ ఇలాంటి సినిమాలు థియేటర్స్ ఫుల్ అయినప్పుడు చూస్తె వచ్చే ఫీల్ పైరసీ లో ఎప్పటికీ రాదనే చెప్పాలి. ఇక ఈ పైరసీ ఇంపాక్ట్ ను తట్టుకుని హిట్3 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి జోరుని ఇప్పుడు చూపించగలుగుతుందో చూడాలి…

NANI Hit3 Movie WW Pre Release Business!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here