Home న్యూస్ బిగ్గెస్ట్ ఫ్రాంచేజ్…అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్5 బుకింగ్స్ ఇలా ఉన్నాయేంటి!!

బిగ్గెస్ట్ ఫ్రాంచేజ్…అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్5 బుకింగ్స్ ఇలా ఉన్నాయేంటి!!

0

ఫ్రాంచేజ్ సిరీస్ లో సినిమాలకు ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది…ఒక సినిమా సీక్వెల్ అని తెలిస్తే చాలు జనాలు ఎగబడి థియేటర్స్ కి వెళుతున్నారు, బాలీవుడ్ లో ఈ క్రేజ్ మరింతగా ఎక్కువగా ఉంటుంది, అక్కడ సూపర్ డూపర్ హిట్ ఫ్రాంచేజ్ లలో ఒకటి అయిన హౌస్ ఫుల్ సిరీస్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అన్నీ కూడా..

సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు ఆ ఫ్రాంజేజ్ నుండి ఆడియన్స్ ముందుకు వస్తున్న 5వ సీక్వెల్ హౌస్ ఫుల్ 5(HouseFull5 Movie) మూవీ ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సూపర్ డూపర్ హిట్ ఫ్రాంజేజ్ అవ్వడంతో…

ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో కుమ్మేస్తాయి అని అందరూ అనుకున్నారు, కానీ అక్షయ్ కుమార్(Akshay Kumar) రీసెంట్ ఫామ్ అస్సలు బాలేక పోవడంతో ఆ ఇంపాక్ట్ ఈ సినిమా మీద కూడా పడగా ఎంత ఫ్రాంజేజ్ హిట్ అయినా కూడా…

ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లోనే ఉన్నాయని తెలుస్తుంది. ఈ ఫ్రాంజేజ్ కి ఫ్యామిలీస్ లో కామెడీ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ దృశ్యా అవలీలగా 26-30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవడం మొదటి రోజు ఏమాత్రం కష్టం కాదు కానీ…

ఈ సినిమా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే 20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవడం కూడా గొప్ప విషయంగానే కనిపిస్తుంది ఇప్పుడు, అది కూడా సినిమాకి మంచి టాక్ సొంతం అయితేనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం ఉందని అంటున్నారు.

అసలే వరుసగా నిరాశ పరిచే సినిమాలతో ఉన్న అక్షయ్ కుమార్ ఈ సినిమాతో ఎలాగైనా కంబ్యాక్ స్ట్రాంగ్ గా ఉంటుందని ఆశిస్తూ ఉండగా ఎంతవరకు సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరు చూపిస్తుందో లేదో చూడాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here