Home న్యూస్ అక్షయ్ కుమార్ “హౌస్ ఫుల్5” మూవీ టాక్ ఏంటి….హిట్టా-ఫట్టా!!

అక్షయ్ కుమార్ “హౌస్ ఫుల్5” మూవీ టాక్ ఏంటి….హిట్టా-ఫట్టా!!

0

బాలీవుడ్ కామెడీ జానర్ లో మంచి హిట్ గా నిలిచిన సిరీస్ లో హౌస్ ఫుల్ సిరీస్ ఒకటి…బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar)నటించిన హౌస్ ఫుల్ 5(HouseFull5 Movie) మూవీ డీసెంట్ అంచనాల నడుమ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది…వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ అయిన సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే ఒక పెద్ద మిలియనీర్ తన 100వ పుట్టిన రోజును గ్రాండ్ గా జరుపుకుంటూ చనిపోతాడు…తన ఆస్తి తన కొడుకు జాలీకి వెళుతుంది అని చెబుతాడు…దాంతో ఆ జాలీ నేనే అంటూ అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముక్ మరియు అభిషేక్ బచ్చన్ లు వస్తారు…

మరి వాళ్ళలో అసలు జాలీ ఎవరు అని అనుకుంటూ ఉన్న టైం లో ఒక హత్య జరుగుతుంది…ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా మిగిలిన కథ…ఓవరాల్ గా చాలా నార్మల్ స్టోరీ పాయింట్ తో తెరకెక్కిన సినిమా లో కామెడీ పార్ట్ అక్కడక్కడా బాగానే వర్కౌట్ అయింది కానీ…

హౌస్ ఫుల్ సిరీస్ లో ఇది వరకు వచ్చిన సినిమాలతో పోల్చితే మరీ అంచనాలను ఏమి మించి పోలేదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించే రేంజ్ ఔట్ పుట్ తో తెరకెక్కింది సినిమా… ఓవరాల్ గా ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించేలా సాగగా మంచి పాయింట్ తో…

ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచగా సెకెండ్ ఆఫ్ కొన్ని చోట్ల డ్రాగ్ అయినా కూడా వరుస పెట్టి క్యామియోలతో రొటీన్ అయినా కూడా బాగానే ఉంది అనిపించేలా సినిమా సాగుతుంది. హౌస్ ఫుల్ సిరీస్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎగబడి వస్తారు కానీ…

ఈ సారి కొంచం అడల్ట్ టచ్ ఉన్న కామెడీ ని కూడా సినిమాలో యాడ్ చేయడం ఒక్కటి అంతగా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు…అలాగే లెంత్ కూడా కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగినా కూడా ఓవరాల్ లెంత్ కూడా కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగినా కామెడీ….

చాలా చోట్ల వర్కౌట్ అవ్వడంతో ఈజీగా ఒకసారి చూసేలా ఉందని చెప్పాలి…మొత్తం మీద అక్షయ్ కుమార్ రీసెంట్ మూవీస్ తో పోల్చితే బెటర్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకున్న హౌస్ ఫుల్5 మూవీ ఒకసారి చూసేలా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here