సుశాంత్ హీరోగా చి.లా.సౌ సినిమాతో మెప్పించినా కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు, అల వైకుంఠ పురం లో సినిమాలో చేసిన సైడ్ రోల్ తో మంచి పేరు దక్కడం తో ఆడియన్స్ ముందుకు ఇచ్చట వాహనుములు నిలుపరాదు సినిమా తో ఆడియన్స్ ముందుకు ఫైనల్ గా వచ్చేశాడు. మరి ఈ సినిమా తో అయినా మెప్పించి బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ ను అందుకున్నాడో లేదో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే…
రౌడీ అండ్ లోకల్ పొలిటికల్ లీడర్ అయిన వెంకట్ చెల్లెలు అయిన హీరోయిన్ మరియు హీరో సుశాంత్ లు ప్రేమించుకుంటారు, ఒక సారి తన ఇంటి దగ్గర హీరోని కలవడానికి ఒప్పుకోగా హీరోయిన్ కి కలవడానికి వెళ్ళిన హీరో అనుకోకుండా క్రైం జరుగుతున్న మరో ప్లేస్ కి వెళతాడు….
దాంతో ఆ క్రైం లో తను కూడా ఒకరు అనుకునే ఆ ఏరియా వాళ్ళు టోటల్ ఏరియా ని లాక్ చేస్తారు. మరి హీరో తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదురుకున్నాడు, బయట పడ్డాడా లేదా అన్నది సినిమా తర్వాత కథ… పెర్ఫార్మెన్స్ పరంగా సుశాంత్ పర్వాలేదు అనిపించాడు, హీరోయిన్ జస్ట్ ఓకే…
విలన్ గా వెంకట్ పర్వాలేదు అనిపించాడు, కామెడీ కూడా అక్కడక్కడా చిన్న చిన్న బిట్స్ గా పర్వాలేదు అనిపించగా సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ యావరేజ్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే పరమ బోర్ కొట్టించే విధంగా ఉన్నాయి. డైలాగ్స్ పెద్దగా సింక్ కరెక్ట్ గా కాలేదు… సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే…
సాదాసీదా కథని ఆల్ మోస్ట్ రెండున్నర గంటల పాటు అతి కష్టం మీద నడిపాడు డైరెక్టర్…. కథలో పెద్దగా స్కోప్ లేక పోవడం తో సీన్స్ ని ఇరికించే ప్రయత్నం చేశాడు కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు… కొన్ని సీన్స్ మట్టుకు ఓకే అనిపించినా ఓవరాల్ గా సినిమా ఏ దశలో కూడా అంచనాలను అందుకునే దిశగా అయితే వెళ్ళలేదు అని చెప్పాలి.
ఉన్నంతలో అందరి పెర్ఫార్మెన్సులు పర్వాలేదు అనిపించడం, కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న కామెడీ బిట్స్ బాగుండటం ప్లస్ పాయింట్స్ అయితే ఫస్టాఫ్, ఫోర్స్ కామెడీ, సినిమా నరేషన్, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇలా చెప్పుకుంటూ పొతే మైనస్ లు చాలానే ఉన్నాయి… ఎంత డిఫెరెంట్ అటెంప్ట్ అంటూ హీరో చెప్పుకొచ్చినా…
ఆడియన్స్ అంచనాలను సినిమా అందుకోలేక పోయింది…. సుశాంత్ చి.లా.సౌ తో మెప్పించినా సక్సెస్ కొట్టలేదు కానీ ఆ సినిమా తనకి మంచి పేరునే తెచ్చిపెట్టింది, కానీ ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమా ఏ దశలో కూడా మెప్పించలేక పోయింది. కొన్ని కొన్ని సీన్స్ ఎంటర్ టైన్ చేసినా ఓవరాల్ గా సినిమా అంచనాలను అందుకోలేదు. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.25 స్టార్స్…