కొన్ని కొన్ని సినిమాలు ఇంట్లో కూర్చుని మొబైల్ లేదా లాప్ టాప్స్, డెస్క్ టాప్స్ లో చూడటం కన్నా కూడా థియేటర్స్ లో ఆడియన్స్ మధ్య ఎక్సైట్ అవుతూ చూడటం ఎంతో త్రిల్ కి గురి చేస్తుంది, అలాంటి కోవలోకి ముఖ్యంగా సైకో థ్రిల్లర్ లేదా సస్పెన్స్ మూవీస్ ముందు వరుసలో ఉంటాయి అని చెప్పాలి. రీసెంట్ టైం లో టాలీవుడ్ లో ఇలాంటి ఎక్స్ పీరియన్స్ ని అందించిన సినిమా రాక్షసుడు.
మళ్ళీ ఆ రేంజ్ లో కాకున్నా ఆ టెంపో ని మెయిన్ టైన్ అయ్యేలా చేసే సత్తా ఉన్న సినిమా గా లేటెస్ట్ గా తెలుగులో డబ్ అయిన మలయాళ సినిమా ఫోరెన్సిక్ అని చెప్పాలి. రాక్షుసుడు మాదిరిగానే పిల్లలు కనిపించకుండా పోవడం….
తర్వాత వాళ్ళు చనిపోవడం, విలన్ ఎవరు అయి ఉండొచ్చు అంటూ గెస్ ల మీద గెస్ లు ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా ఓ రేంజ్ లో ఉత్కంటని రేకెత్తించగా… అప్పటి వరకు ఉన్న ఫ్లోకి తగ్గ రేంజ్ లో విలన్ ఫ్లాష్ బ్యాక్ లేక పోయినా క్లైమాక్స్ కూడా జస్ట్ ఓకే అనిపించే విధంగానే ఉన్నప్పటికీ…
ఫోరెన్సిక్ సినిమా రీసెంట్ టైం లో వచ్చిన వన్ ఆఫ్ బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ లో ఒకటిని చెప్పొచ్చు. ముందుగా చెప్పినట్లే ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా స్క్రీన్ ప్లే అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మరో లెవల్ లో ఉండటం సినిమా కి బాగా కలిసి వచ్చే అంశం, అందుకే మలయాళం లో సినిమా సూపర్ హిట్ అవ్వగా తెలుగులో రీమేక్ అవుతుంది…
అని అంతా అనుకున్నా పరిస్థితుల నేపధ్యంలో సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేశారు డబ్ చేసి… అదే సినిమా ఇప్పుడు పరిస్థితులు బాగుండి, డబ్ అయినా లేక రీమేక్ అయినా కానీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటె కచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని తెలుగు లో సొంతం చేసుకుని ఉండేది…