Home న్యూస్ ఒక్క హాలిడే వచ్చి ఉంటేనా…కల్కి చరిత్ర సృష్టించేది….మిస్ అయ్యింది!

ఒక్క హాలిడే వచ్చి ఉంటేనా…కల్కి చరిత్ర సృష్టించేది….మిస్ అయ్యింది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ నటించిన సినిమాల్లో సూపర్బ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD)…చాలా వరకు పెద్ద చిన్న సినిమాలు ఏవి అయినా కూడా రీసెంట్ టైంలో 3-4 వారాల పాటు షేర్స్ ని రాబట్టడమే పెద్ద విషయం కాగా….

కల్కి మూవీ మాత్రం 7వ వారంలో కూడా షేర్స్ ని సొంతం చేసుకుంటూ ఉండటం రీసెంట్ టైంలోనే బెస్ట్ రన్ అని చెప్పాలి. ఇక్కడ మరో విషయం ఏంటి అంటే కల్కి మూవీ ఎలాంటి హాలిడే అడ్వాంటేజ్ లు లేకుండా రిలీజ్ అయ్యి ఇన్ని రోజుల పాటు షేర్స్ ని రాబట్టడం బిగ్గెస్ట్ అచీవ్ మెంట్….

ఇలా ఎలాంటి హాలిడేలు లేకుండానే సినిమా అన్ని చోట్లా ఊరమాస్ కలెక్షన్స్ ని అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో హిందీలో సూపర్బ్ సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోగా మొదటి 2 వారాల్లో సినిమా కి వర్కింగ్ డేస్ లో ఒక్క హాలిడే అడ్వాంటేజ్ లభించినా కూడా ఇప్పుడు 3 బిగ్ అచీవ్ మెంట్ లు సొంతం చేసుకుని ఉండేది…

Kalki 2898 AD 46 Days Total World Wide Collections!!

సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 296 కోట్ల లోపు గ్రాస్ ను అందుకుంది…ఇనీషియల్ స్టేజ్ లో ఒక్క హాలిడే పడి ఉన్నా ఈజీగా 300 కోట్ల మార్క్ ని దాటేసి ఉండేది…ఇక ఒకటి రెండు హాలిడేలు సొంతం అయ్యి ఉంటే నైజాంలో సినిమా హిస్టారికల్….

100 కోట్ల షేర్ మార్క్ కి  చేరువ అవ్వడమో లేక క్రాస్ చేయడమో చేసి ఉండేది అని చెప్పాలి…కానీ హాలిడేలు లేకుండానే ఈ రేంజ్ రన్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఇక హిందీలో సినిమా 293 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా…

ఇనీషియల్ స్టేజ్ లో ఒకటి రెండు హాలిడేలు దక్కి ఉన్నా కూడా అవలీలగా 300 కోట్ల ప్రతిష్టాత్మక నెట్ కలెక్షన్స్ ని అందుకుని ఉండేది…కానీ సినిమా ఎలాంటి హాలిడే అడ్వాంటేజ్ లు లేకుండా రిలీజ్ అయినా ఈ రేంజ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకోవడం బిగ్గెస్ట్ రికార్డ్ అయినా కూడా…

ఒక్క మంచి హాలిడే దక్కినా కూడా మరికొన్ని హిస్టారికల్ బెంచ్ మార్క్ లు సినిమా సొంతం చేసుకుని ఉండేది…ఈ రికార్డులు మిస్ అయినా కూడా 3 నెలల అన్ సీజన్ ఇంపాక్ట్ తర్వాత టాలీవుడ్ కి తిరిగి ఊపిరి పోసిన కల్కి వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసి ఇప్పుడు పరుగును పూర్తి చేసుకోవడానికి సిద్ధం అవుతుంది.

Kalki 2898 AD 44 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here