Home న్యూస్ టాలీవుడ్ లో బాహుబలి తర్వాత అఖండ సినిమానే…మాస్ ఇది!

టాలీవుడ్ లో బాహుబలి తర్వాత అఖండ సినిమానే…మాస్ ఇది!

2159
0

అదేంటి బాహుబలి తో బాలయ్య అఖండ కి పోలికేంటి అని అనుకుంటున్నారా… ఆ సినిమా బడ్జెట్ వేరు ఈ సినిమా బడ్జెట్ వేరు కానీ ఒక విషయం లో ఇప్పుడు టాలీవుడ్ మొత్తం మీద బాహుబలి తర్వాత ఏదైనా సినిమా ఉందీ అంటే అది ఇప్పుడు బాలయ్య అఖండ సినిమా అని చెప్పొచ్చు. ఆ విషయం మరేదో కాదో సినిమాలో ఉన్న యాక్షన్ సీన్స్ గురించి. బాలయ్య బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో…

సినిమా అంటే ప్రతీ ఒక్కరు కోరుకునేది ఓ రేంజ్ లో ఉండే యాక్షన్ సీన్స్, అలాగే ఓ రేంజ్ లో ఉండే హీరోయిజం ఎలివేషన్ సీన్స్ గురించి. ఇది వరకు వచ్చిన సింహా లెజెండ్ సినిమాల్లో యాక్షన్ కానీ హీరోయిజం సీన్స్ కానీ మరో లెవల్ అనిపించేలా తీసిన బోయపాటి…

ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాగైనా కంబ్యాక్ చేయాల్సిన అవసరంలో ఉన్నాడు, మరో పక్క బాలయ్య కూడా రీసెంట్ టైం లో వచ్చిన డిసాస్టర్ మూవీస్ అన్నింటినీ మరిపించే బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరంలో ఈ ఇద్దరూ కలిసి హాట్రిక్ మూవీ గా చేస్తున్న అఖండలో…

యాక్షన్ సీన్స్ మరో లెవల్ లో ఉంటాయని అంటున్నారు. టాలీవుడ్ లో బాహుబలి సిరీస్ కి తప్పితే మరే నార్మల్ మూవీ కి కూడా మహా అయితే నెలన్నర, రెండు నెలల లోపు యాక్షన్ సీన్స్ లాంగ్ షెడ్యూల్స్ తో పూర్తీ చేశారు. కానీ ఈ అఖండ సినిమా విషయంలో మట్టుకు ఏకంగా 80 రోజుల వర్కింగ్ డేస్ లో యాక్షన్ సీన్స్ నే చిత్రీకరించారట.

టాలీవుడ్ లో బాహుబలి సిరీస్ కాకుండా మరే సినిమా కి ఇన్ని రోజుల లెవల్ లో యాక్షన్ సీన్స్ ని తీయలేదట, అఖండ లో ఆ రేంజ్ లో యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయని అంటున్నారు ఇప్పుడు. సినిమా టీసర్ ఆల్ రెడీ సాలిడ్ రచ్చ చేసింది. ఇక సినిమా రిలీజ్ డేట్ ను అతి త్వరలోనే కన్ఫాం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి బాలయ్య బోయపాటి ఈ సినిమాతో ఏ రేంజ్ లో కంబ్యాక్ ఇస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here