లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చి ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది… మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకుని ఏమాత్రం అంచనాలను అందుకునే వసూళ్ళని అందుకోలేక పోయింది…
2 వారాల్లో అతి కష్టం మీద 150 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా మూడో వారంలో కంప్లీట్ గా వాషౌట్ అయిపొయింది…దాంతో ఎపిక్ డిసాస్టర్ గా నిలిచిన సినిమాను త్వరగా డిజిటల్ లో రిలీజ్ చేసి నష్టాలను కొంచం తగ్గించుకోవాలి అని అనుకున్నారు..
కానీ మేకర్స్ కి ఓటిటి వాళ్ళు ఇప్పుడు దిమ్మతిరిగే షాకిచ్చినట్లు కోలివుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి, సినిమా అన్ని భాషల డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ వాళ్ళు భారీ రేటు చెల్లించి దక్కించుకున్నారు. ఆల్ మోస్ట్ అన్ని భాషలు కలిపి ఏకంగా 120 కోట్ల రేంజ్ లో…
రేటుని సొంతం చేసుకోగా ఇప్పుడు సినిమా ఎపిక్ డిసాస్టర్ అవ్వడంతో నెట్ ఫ్లిక్స్ వాళ్ళు సినిమా ఎర్లీ ఓటిటి రిలీజ్ కి ఒప్పుకోవడం లేదని, ఇచ్చిన రేటుకి సినిమా రిజల్ట్ ఏమాత్రం మ్యాచ్ చేయకపోవడంతో తాము ఇచ్చిన అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేయాలని….
తర్వాత కొత్త రేటుని ఫైనల్ చేసిన తర్వాతే సినిమా డిజిటల్ రిలీజ్ డేట్ ఉంటుందని చెప్పినట్లు స్ట్రాంగ్ గా బజ్ ఉంది…దాంతో ఎర్లీ ఓటిటి రిలీజ్ ఇప్పుడు హోల్డ్ అయిపోగా ఎప్పుడు సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంటో అన్నది క్లారిటీ లేకుండా పోయింది..
బాక్స్ ఆఫీస్ దగ్గరే ఎపిక్ డిసాస్టర్ గా నిలిచిన సినిమా ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అయ్యి నష్టాలను తగ్గించుకోవాలి అనుకున్నా కూడా డిజిటల్ లో రిలీజ్ అవ్వకముందే భారీగా శాకిచ్చే రిజల్ట్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక డిజిటల్ రిలీజ్ ఎప్పుడు కన్ఫాం చేసుకుంటుందో చూడాలి ఇక….