మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా రొటీన్ కథనే అయినా కానీ మాస్ ఆడియన్స్ ను బాగానే ఇంప్రెస్ చేస్తూ మంచి ఓపెనింగ్స్ ని అందుకుంటూ ఉండగా సినిమా చూసిన తర్వాత సినిమాలో కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అయ్యి థియేటర్స్ లో నవ్వులపూవులు పూసేలా చేసింది అని చెప్పాలి. ముఖ్యంగా ఫస్టాఫ్ లో వచ్చే ఓ ఎపిసోడ్ మొత్తం…
హిలేరియస్ గా వర్కౌట్ అయ్యి థియేటర్స్ ని ఓ రేంజ్ లో షేక్ చేసింది… ఆ సీనే ఇంద్ర సినిమాలోని ప్రకాష్ రాజ్ తన కూతురుని హీరో ఇంట్లో నుండి తీసుకెళ్లడానికి వచ్చే సీన్. ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హైలెట్ కాగా ఇప్పుడు ఈ సీన్ ని…
ధమాకాలో రీ క్రియేట్ చేశారు. ఇక్కడ రావు రమేష్ ప్రకాష్ రాజ్ రోల్ చేయగా ఆ కామెడీ బిట్ ఫస్టాఫ్ కి బిగ్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఆ ఎపిసోడ్ మొత్తం కూడా థియేటర్స్ నవ్వులతో విజిల్స్ ఓ రేంజ్ లో షేక్ అయ్యేలా చేసింది అని చెప్పొచ్చు.
ఆ రేంజ్ లో ఆ సీన్ వర్కౌట్ అయింది ఇక్కడ… ఇటు రావ్ రమేష్ అటు రవితేజలు ఈ సీన్ లో అదరగొట్టేశారు, మని శర్మ ఒరిజినల్ బ్యాగ్రౌండ్ స్కోర్ నే ఇక్కడ కూడా వాడారు, ఓవరాల్ గా ఈ సీన్ సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్స్ లో ఒకటిగా నిలిచి లాంగ్ రన్ కి హెల్ప్ అయ్యే అవకాశాన్ని కల్పించింది…