Home న్యూస్ అక్షరాలా 12,200 కోట్లు….చిన్న పిల్లల మూవీ ఎపిక్ రికార్డ్!

అక్షరాలా 12,200 కోట్లు….చిన్న పిల్లల మూవీ ఎపిక్ రికార్డ్!

0

హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ కొన్ని భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మంచి టాక్ తో కుమ్మేశాయి కూడా…కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం రీసెంట్ టైంలో హాలీవుడ్ సినిమాలు అండర్ పెర్ఫార్మ్ చేస్తూ ఉండగా ఓ భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న టైంలో ఆడియన్స్ ముందుకు చిన్న పిల్లల సినిమా నే అయినా కూడా…

మంచి క్రేజ్ నడుమ రిలీజ్ అయిన ఇన్ సైడ్ ఔట్2(Inside Out 2 Movie) మూవీ ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. పేరుకు చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడే యానిమేషన్ మూవీనే అయినా కూడా ఆల్ మోస్ట్ 1600 కోట్ల రేంజ్ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ ఈ ఇయర్ లో బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేయగా ఓవరాల్ గా హాలీవుడ్ లో యానిమేషన్ మూవీస్ పరంగా చూసుకుంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వసూళ్ళతో సంచలనం సృష్టించింది ఈ సినిమా…

మొత్తం మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ లెక్క ఏకంగా 1.47 బిలియన్ మార్క్ ని అందుకున్నాయి…ఇప్పటికీ కలెక్షన్స్ స్టడీగా వస్తూ ఉండగా త్వరలోనే 1.5 బిలియన్ మార్క్ ని అందుకోబోతున్న ఈ సినిమా ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ లెక్క…

ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే అక్షరాలా 12 వేల 200 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది. అంటే బడ్జెట్ మీద ఎన్నో రెట్ల వసూళ్ళని సొంతం చేసుకున్న ఈ సినిమా ఊహకందని లాభాలతో ఊచకోత కోస్తూ ఉండటం విశేషం… సినిమా లాంగ్ రన్ లో 1.66 బిలియన్ మార్క్ ని…

కనుక అందుకో గలిగితే హాలీవుడ్ లో యానిమేషన్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న ది లయన్ కింగ్ మూవీ రికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టాప్ 2 ప్లేస్ లో ఉన్న ఈ సినిమా ఫైనల్ రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here