Home న్యూస్ ఇండియాలో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఇంటర్ స్టెల్లర్ రీ రిలీజ్ కలెక్షన్స్!!

ఇండియాలో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఇంటర్ స్టెల్లర్ రీ రిలీజ్ కలెక్షన్స్!!

0

హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన క్రిస్టఫర్ నోలన్ డైరెక్షన్ లో వచ్చే సినిమాలు అంటే వరల్డ్ వైడ్ సినీ లవర్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇండియాలో కూడా సాలిడ్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న నోలన్ డైరెక్షన్ లో వచ్చిన ఓల్డ్ మూవీస్ కి కూడా ఇక్కడ కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి టైంలో ఇండియాలో ఇప్పుడు నోలన్ డైరెక్షన్ లో వచ్చిన….

ఎపిక్ మూవీస్ లో ఒకటైన ఇంటర్ స్టెల్లర్ మూవీ ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు….రిపీట్స్ లో తప్ప అంత ఈజీగా అర్ధం అవ్వని కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని ఇండియాలో అందుకుంది. కానీ తర్వాత డిజిటల్ లో సాలిడ్ క్రేజ్ ను..

సొంతం చేసుకున్న ఈ సినిమా మీద ఇండియాలో మంచి క్రేజ్ ఉండటంతో రీసెంట్ గా ఇంటర్ స్టెల్లర్ ను రీ రిలీజ్ చేయగా ఇండియాలో రిలీజ్ అయిన హాలీవుడ్ రీ రిలీజ్ మూవీస్ లో రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా ఓవరాల్ గా 6 రోజులు పూర్తి చేసుకుని..

ఆల్ మోస్ట్ 16 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇండియాలో రీ రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీస్ లో రికార్డ్ వసూళ్ళతో దూసుకు పోతూ ఉండటమే కాకుండా ఓవరాల్ గా ఇండియాలో రీ రిలీజ్ అయిన అన్ని మూవీస్ లో కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకుంటూ…

దుమ్ము దుమారం లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా ఇండియాలో…మల్టీప్లెక్సులలో సినిమాకి ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీ రిపోర్ట్ అవుతూ ఉండటంతో మరిన్ని హాలీవుడ్ రీ రిలీజ్ లు ఇప్పుడు ఇండియాలో రీ రిలీజ్ ల కోసం ఎదురు చూడటం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here