లాస్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ దగ్గర SR కళ్యాణ మండపం సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ ను సొంతం చేసుకున్నాయి. కానీ అవన్నీ కూడా SR కళ్యాణ మండపం సినిమా దాటికి ఏమాత్రం తేరుకోలేక పోయాయి. అసలు ఆ సినిమాలను జనాలు ఎవ్వరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు అనే చెప్పాలి. కానీ ఉన్నంతలో ఆ సినిమాల్లో ఎంతో కొంత బజ్ ని క్రియేట్ చేసిన సినిమా గా అడల్ట్ కంటెంట్ తో…
వచ్చిన ఇప్పుడు కాకపొతే ఇంకెప్పుడు సినిమా ఎంతో కొంత జనాలను థియేటర్స్ కి రప్పించింది… యూత్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు మంచి ప్రమోషన్స్ తోనే రాగా సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చాక మరీ అనుకున్న రేంజ్ లో అయితే…
టాక్ ని సొంతం చేసుకోలేక పోయింది. దాంతో సినిమా కి లిమిటెడ్ ఓపెనింగ్స్ లభించినా తర్వాత అది లాంగ్ రన్ లేకుండా చేసింది. వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోయి వీకెండ్ తర్వాత చాలా థియేటర్స్ నుండి సినిమా తొలగి పోవడం జరిగింది. సినిమాను మొత్తం మీద…
90 లక్షల రేంజ్ బడ్జెట్ తో నిర్మించగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ ఏమి లేకుండా ఓన్ గానే రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో వీకెండ్ లోపు 19 లక్షల గ్రాస్ ని వర్కింగ్ డేస్ లో 4 లక్షల గ్రాస్ ని టోటల్ గా 23 లక్షల గ్రాస్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ పరుగును ముగించింది.
ఎంత అడల్ట్ టచ్ ఉన్న కథనే అయినా కానీ జనాలు SR కళ్యాణ మండపంకి ఓటు వేసి ఈ సినిమా కి వెళ్ళలేదు. సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే సినిమా రిజల్ట్ కొంచం బెటర్ గా వచ్చి ఉండేదేమో… అదే టైం లో ప్రతీ సారి యూత్ ని అడల్ట్ టచ్ ఉన్న స్టొరీలతో థియేటర్స్ రప్పించడం కూడా అంత సులువుగా అయ్యే పని కాదని ఈ సినిమా రుజువు చేసింది.