Home న్యూస్ 8 కోట్ల రేటుకి నో చెబితే…ఫస్ట్ వీక్ లో వచ్చిన కలెక్షన్స్ ఇవి!…పాపం!

8 కోట్ల రేటుకి నో చెబితే…ఫస్ట్ వీక్ లో వచ్చిన కలెక్షన్స్ ఇవి!…పాపం!

1677
0

జనాలు ఫస్ట్ వేవ్ అయిన తర్వాత థియేటర్స్ కి తరలి వచ్చినట్లు సెకెండ్ వేవ్ అయిన తర్వాత అయితే రావడం లేదు, ఇంకా బెటర్ మూవీస్ ఆడియన్స్ ముందుకు వస్తే తప్పితే జనాలు థియేటర్స్ కి తరలి వచ్చేలా లేరు. లేటెస్ట్ గా సెకెండ్ వేవ్ తర్వాత ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న లేటెస్ట్ మూవీ తేజ సజ్జ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ కాంబినేషన్ లో వచ్చి ఇష్క్…

ఏప్రిల్ నెలలోనే ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ ఇష్క్ మూవీ కి రీమేక్ గా తెరకెక్కగా సినిమా డిజిటల్ లో డైరెక్ట్ రిలీజ్ చేయడానికి సాలిడ్ ఆఫర్స్ వచ్చాయి. ఆల్ మోస్ట్ 8 కోట్ల రేంజ్ డిజిటల్ రిలీజ్ ఆఫర్స్ వచ్చినా నో చెప్పి…

సినిమా ఆడియన్స్ ముందుకు కేవలం 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే తీసుకు రాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత టాక్ నెగటివ్ గా రావడం తో ఏ దశలో కూడా కలెక్షన్స్ ని సాధించే దిశగా అడుగులు వేయలేక పోయింది.

2.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 55 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ 67 లక్షల షేర్ ని మాత్రమె సాధించగా మొదటి వారం పూర్తీ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాలలో 64 లక్షల షేర్ ని సాధించగా వరల్డ్ వైడ్ గా 78 లక్షల రేంజ్ షేర్ ని మాత్రమె సొంతం చేసుకుని నిరాశ పరిచింది.

సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఇంకా 1.92 కోట్ల షేర్ ని సాధించాల్సి ఉండగా సెకెండ్ వీక్ ఆల్ మోస్ట్ సగానికి పైగా థియేటర్స్ ని కోల్పోయిన ఇష్క్ సినిమా భారీ డిసాస్టర్ గా నిలవనుంది ఇప్పుడు. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం 8 కోట్ల రేటు కి ఓకే చేసి ఉంటే మంచి ప్రాఫిట్స్ ను సొంతం చేసుకునేది కానీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రిజల్ట్ తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here