Home న్యూస్ 2.7 కోట్ల టార్గెట్….3 రోజుల్లో వచ్చింది ఇది…పాపం!!

2.7 కోట్ల టార్గెట్….3 రోజుల్లో వచ్చింది ఇది…పాపం!!

2482
0

రిలీజ్ కి ముందు మంచి ప్రమోషన్స్ తో మినిమమ్ హైప్ ను సొంతం చేసుకుని సెకెండ్ పాండమిక్ తర్వాత రిలీజ్ కి సిద్ధం అయిన మొదటి సినిమా తిమ్మరుసు కి పోటిగా రిలీజ్ ను కన్ఫాం చేసుకుని ఆ సినిమా కన్నా ఎక్కువ బిజినెస్ ను మొత్తం మీద సొంతం చేసుకుని తొలిరోజు ఓపెనింగ్స్ పరంగా హౌస్ ఫుల్ బోర్డ్స్ తో ఓపెన్ అయినా ఈవినింగ్ షోల నుండి డీలా పడిపోయింది ఇష్క్ సినిమా..

తేజ సజ్జ ప్రియా ప్రకాష్ వారియర్ ల కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ ఇష్క్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కగా సినిమా ఆదియన్స్ ముందుకు వచ్చిన తర్వాత రెస్పాన్స్ అంతంత మాత్ర్రమే ఉండటం తో ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై…

క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడు. ఫస్ట్ డే 15 లక్షల షేర్ ని, రెండో రోజు 12 లక్షల షేర్ ని సొంతం చేసుకున్న ఇష్క్ సినిమా మూడో రోజు ఆదివారం ఫ్రెండ్ షిప్ డే అడ్వాంటేజ్ కూడా ఉండగా గ్రోత్ మరింత ఎక్కువ సొంతం చేసుకోవాల్సిన అవసరంతో రోజును మొదలు పెట్టగా…

మొత్తం మీద మూడో రోజు ఈ సినిమా 20 లక్షల రేంజ్ లో షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. దాంతో మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 47 లక్షల దాకా షేర్ ని సాధించగా టోటల్ వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో 58 లక్షల లోపు షేర్ ని సొంతం చేసుకుంది. సినిమాను మొత్తం మీద 2.5 కోట్ల రేంజ్ రేటుకి అమ్మగా…

2.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇష్క్ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 2.12 కోట్ల షేర్ ని ఇంకా సాధించాల్సిన అవసరం ఉంది. సినిమా ఏ విధంగా చూసుకున్నా ఇక బ్రేక్ ఈవెన్ ను అందుకునే అవకాశం అయితే లేదనే చెప్పాలి. కానీ వర్కింగ్ డేస్ లో ఇదే విధంగా పెర్ఫార్మ్ చేస్తే లాస్ ని తగ్గించే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here