Home న్యూస్ ఇస్మార్ట్ శంకర్ బుకింగ్స్ రిపోర్ట్….ఫస్ట్ డే ఎంత రావచ్చో తెలుసా?

ఇస్మార్ట్ శంకర్ బుకింగ్స్ రిపోర్ట్….ఫస్ట్ డే ఎంత రావచ్చో తెలుసా?

825
0

     రామ్ కెరీర్ లో రీసెంట్ టైం లో వస్తున్న పక్కా మాస్ మూవీ “ఇస్మార్ట్ శంకర్”, పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీ లెవల్ లో ఉండగా సినిమా బిజినెస్ పరంగా కుమ్మేసి 17.8 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సాధించి సత్తా చాటగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సుమారు 920 కి పైగా థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది.

ఇక సినిమా కి అడ్వాన్స్ బుకింగ్స్ ఏ రేంజ్ లో జరిగింది అన్నది పరిశీలిస్తే… 4 రోజుల ముందు నుండే మొదలు అయిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ఏరియాల్లో అద్బుతంగా సాగుతుందని చెప్పొచ్చు. ఓవరాల్ అడ్వాన్స్ బుకింగ్స్ 65% వరకు ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయు.

ఇక సినిమా నైజాం ఏరియాలో సుమారు 230 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరి పోయే లెవల్ లో జరుగుతుంది, కాగా బుకింగ్స్ ని బట్టి తొలిరోజు ఇక్కడ అవలీలగా సినిమా 2 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉందని అంటున్నారు.

టాక్ ని బట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ లెక్క పెరగడమో తగ్గడమో జరుగుతుందని అంటున్నారు. ఇక మిగిలిన ఏరియాల్లో కూడా జోరు చూపే చాన్స్ ఉండగా టోటల్ గా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇస్మార్ట్ శంకర్ సినిమా మినిమం లో మినిమమ్….

4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో వసూళ్ళ ని సాధించే చాన్స్ ఉందని అంటున్నారు, మరి సినిమా ఇంతకుమించి కూడా ముందుకు పోయే చాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి ఫస్ట్ డే సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here