Home న్యూస్ ఇస్మార్ట్ శంకర్ రివ్యూ – దుమ్ము లేచిపోయింది!!

ఇస్మార్ట్ శంకర్ రివ్యూ – దుమ్ము లేచిపోయింది!!

0

  ఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్ లో పక్కా మాస్ మూవీ చేయలేదు… ప్రస్తుతం ట్రెండ్ కూడా అలాంటి ఊరమాస్ మూవీస్ కి అనుకూలంగా లేదు అనుకుని అందరు డిఫెరెంట్ జానర్ మూవీస్ చేస్తున్నారు. ఇలాంటి సమయం లో పోకిరి, దేశముదురు లాంటి ఔట్ అండ్ ఔట్ మాస్ మూవీస్ చేసిన పూరీ డైరెక్షన్ లో ఇస్మార్ట్ శంకర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు రామ్. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందో లేదో తెలుసుకుందాం పదండీ…

కథ: జైలు నుండి తప్పించుకున్న హీరో అనుకోకుండా ఒక ఫైట్ లో గాయపడగా… మెదడు కి సంభందించిన పరిశోధనలు చేసే నిధి హీరో మెదడులో ఒక డ్యుయల్ మెమోరీ చిప్ పెడుతుంది… అసలు ఆ చిప్ ఎందుకు పెట్టారు, మరో హీరోయిన్ నిబా తో హీరో లవ్ ఎపిసోడ్ ఏంటి… అనేది అసలు కథ… కథ పూర్తిగా రివీల్ చేయకుండా మెయిన్ పాయింట్ గురించి చాల తక్కువగా చెప్పాం…

విశ్లేషణ: కథ పాయింట్ సినిమా మొత్తం చూశాకా ఇంత చిన్నదా అనిపిస్తుంది, కానీ రేసీ స్క్రీన్ ప్లే తో పూరీ రాఫ్ఫాడించాడు, అసలు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా తర్వాత సీన్ వస్తుంది. దాంతో ఆడియన్స్ చివరి వరకు ఆసక్తి తో సినిమా చూస్తారు. హీరో రామ్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపేశాడు. తన ఎనర్జీ అదుర్స్ అనిపిస్తుంది. నటన కూడా అద్బుతంగా ఉంది..

తెలంగాణా స్లాంగ్ లో డైలాగ్స్ మొదట్లో కొంచం ఇబ్బంది పెట్టినా తర్వాత మెప్పిస్తాయి. ఇక హీరోయిన్స్ ఇద్దరు ఆకట్టుకోగా గ్లామర్ షో విషయం లో పోటి పడ్డారు అని చెప్పొచ్చు. సత్య రోల్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంది. మిగిలిన నటీనటులు ఉన్నంతలో బాగానే నటించి మెప్పించారు.

Ismart Shankar First Day Collections...May Cross 4.5cr+

సంగీతం: చాలా ఏళ్లకి మణిశర్మ తన మార్క్ ని చూపెట్టి సినిమా కి వెన్నెముకగా నిలిచాడు, అన్ని పాటలు ఆకట్టుకోగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో దుమ్ము లేపాడు, క్లైమాక్స్ ఎపిసోడ్ లో మని బ్యాగ్రౌండ్ స్కోర్ మరో లెవల్ లో ఉంటుంది అని చెప్పాలి. ఈ సినిమా తో మణిశర్మ మళ్ళీ బిజీ అవ్వడం పక్కా అని చెప్పొచ్చు.

డైరెక్షన్: పోకిరి, దేశముదురు లాంటి అల్ట్రా మాస్ మసాలా మూవీస్ తర్వాత పూరీ నుండి వచ్చిన పక్కా మాస్ మూవీ ఇదే… టెంపర్ తర్వాత హిట్ లేదు అన్న కసి తో ఈ సినిమా విషయం లో వింటేజ్ పూరీ ని బయటికి తీసి రాఫ్ఫాడించాడు పూరీ జగన్నాథ్. కథ పాయింట్ అంత పకడ్బందీగా లేకున్నా తనదైన స్క్రీన్ ప్లే తో డైలాగ్స్ తో సినిమాను నిలబెట్టాడు.

మొత్తం మీద సినిమాలో హైలెట్స్ బాగున్నా స్టొరీ అంత పకడ్బందీగా లేక పోవడం, ఓవర్ గా అరవడం, టూ మాసీ గా ఉండటం చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్స్.. అవి పక్కకు పెడితే ఈ మద్య ఇలాంటి మాస్ మూవీ తెలుగు లో రాలేదు కాబట్టి మాస్ ఆడియన్స్ కి విందు భోజనం అనే చెప్పాలి.

ఓవరాల్ గా సినిమాకు మా రేటింగ్ 3/5…. మాస్ ఆడియన్స్ మెప్పు పొందినా క్లాస్ ఆడియన్స్ ఎంతవరకు థియేటర్స్ కి వస్తారు అన్నదాని పై సినిమా ఎంతదూరం వెళుతుంది అన్నది చెప్పగలం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

iSmart Shankar First Day Openings....Humongous

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here