Home న్యూస్ ఇటు 230 అటు 440… టోటల్ లెక్క ఇదే!

ఇటు 230 అటు 440… టోటల్ లెక్క ఇదే!

574
0

     ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ “ఇస్మార్ట్ శంకర్” బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, పూరీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పై మాస్ లో మంచి క్రేజ్ ఉండగా సినిమా ఓవరాల్ గా 17.8 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 18.8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా ఓవరాల్ థియేటర్స్ కౌంట్ కన్ఫాం అయ్యింది.

సినిమా నైజాం ఏరియాలో 230 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా ఆంధ్రా లో 300 వరకు సీడెడ్ లో 140 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుందని సమాచారం, రెండు తెలుగు రాష్ట్రాలలో ఫైనల్ గా 670 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ని కన్ఫాం చేసుకోగా…

కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో 150 అలాగే ఓవర్సీస్ లో సుమారు 100 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 920 కి పైగా థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, రీసెంట్ టైం లో రామ్ కెరీర్ లో ఇది….

వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ లలో ఒకటిగా చెప్పుకోవచ్చు, ఊరమాస్ మూవీ గా తెరకెక్కుతున్న సినిమా అవ్వడం తో పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటే సినిమా అవలీలగా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్ళ ని సాధించే అవకాశం కూడా పుష్కలంగా ఉందని చెప్పాలి. మరో పక్క…

టెంపర్ తర్వాత నికార్సయిన హిట్ కోసం ఎదురు చూస్తున్న పూరీ జగన్నాథ్ కూడా తన ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు. మరి ఇందరి ఆశాలను మోస్తున్న ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here