Home న్యూస్ సన్నీ డియోల్ “జాట్” మూవీ టాక్ ఏంటి….హిట్టా-ఫట్టా!!

సన్నీ డియోల్ “జాట్” మూవీ టాక్ ఏంటి….హిట్టా-ఫట్టా!!

0

టాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ లో ముందు నిలిచే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు బాలీవుడ్ లో గదర్2 తో సంచలనం సృష్టించిన సన్నీ డియోల్(Sunny Deol) తో చేసిన భారీ బడ్జెట్ మూవీ జాట్(Jaat Movie) సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. గదర్2 తర్వాత సన్నీ డియోల్ నుండి వస్తున్న సినిమా అవ్వడంతో ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అందరిలో ఉండగా…

తెలుగు నిర్మాతలు, తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని తీసిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ… కథ పాయింట్ కి వస్తే శ్రీలంక నుండి ఆంధ్ర ప్రదేశ్ కి తన గ్యాంగ్ తో వచ్చిన విలన్ రణదీప్ హుడా తన సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకుని ఊరి ప్రజలను పట్టి పీడిస్తాడు…

ఈ క్రమంలో అనుకోకుండా విలన్ గ్రూప్ తో ఓ చిన్న గొడవ పడిన హీరో ఆ ఊరికి వచ్చి ఏం చేశాడు అన్నది మొత్తం మీద స్టోరీ పాయింట్…కథ పాయింట్ పక్కా రెగ్యులర్ మాస్ కమర్షియల్ టాలీవుడ్ మూవీస్ ఎలా ఉంటాయో అలాంటి కథనే… కానీ బాలీవుడ్ వాళ్ళకి ఇది కొంత కొత్తదనమే అని చెప్పాలి.

అక్కడ వస్తున్న మూస సినిమాల మీద ఈ రేంజ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటం అన్నది వాళ్ళకి గొప్పే…అందునా ఫేడ్ ఔట్ టైంలో గదర్2 తో సంచలనం సృష్టించిన సన్నీ డియోల్ ని ఈ రేంజ్ పవర్ ఫుల్ రోల్ లో అక్కడ ఎవ్వరూ గత 20 ఏళ్లలో అయితే చూపించి ఉండరు అనే చెప్పాలి.

ఆ రేంజ్ లో పవర్ ఫుల్ రోల్ లో మన బాలయ్యని తలపించే రేంజ్ స్క్రీన్ ప్రజెన్స్…మాస్ సీన్స్ తో కుమ్మేశాడు సన్నీ డియోల్…. హీరోయిజం ఎలివేట్ సీన్స్ బాలీవుడ్ మాస్ ఆడియన్స్ కి ఓ రేంజ్ లో కిక్ ఇవ్వడం ఖాయం… కానీ మన వరకు చూసుకుంటే…

ఇలాంటి రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ మనం ఆల్ రెడీ చాలానే చూసి చూసి ఉండటంతో పెద్దగా కొత్తదనం ఏమి లేదని పించింది…కానీ బాలీవుడ్ వాళ్ళ దృష్టితో చూస్తె హీరోయిజం తమన్ కొట్టిన ఊరమాస్ బ్యాగ్రౌండ్ స్కోర్ అక్కడ ఆడియన్స్ కి బాగానే నచ్చేలా ఉందని చెప్పాలి.

ఓవరాల్ గా ఫక్తు రెగ్యులర్ ఫార్మాట్ లో సాగే కమర్షియల్ మూవీ నే జాట్ మూవీ…తెలుగు స్టార్స్ నటించాల్సిన లీడ్ రోల్ లో ఒక ఒక హిందీ సీనియర్ స్టార్ కనిపించారు అంతే… బాలీవుడ్ వాళ్ళకి ఇది ఈ మాత్రం మాస్ డోస్ చాలు… తెలుగు ఆడియన్స్ ఇలాంటివి ఎన్నో చూసి చూసి ఉండటంతో ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది జాట్ మూవీ…సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here