Home న్యూస్ రవితేజ చేయాల్సిన జాట్ మూవీ…అడ్వాన్స్ బుకింగ్స్….ఇది ఊహించలేదుగా!!

రవితేజ చేయాల్సిన జాట్ మూవీ…అడ్వాన్స్ బుకింగ్స్….ఇది ఊహించలేదుగా!!

0

గోపీచంద్ మలినేని మరియు మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) ల కాంబోలో వచ్చిన సినిమాలు అన్నీ హిట్స్ కాగా వీళ్ళ కాంబో లో 4వ సినిమాగా రావాల్సిన మూవీ అనుకోకుండా బడ్జెట్ ప్రాబ్లమ్స్ వలన కాన్సిల్ అవ్వగా అదే సినిమాను బాలీవుడ్ లో గదర్2 సినిమాతో సెన్సేషనల్ రికార్డులను అందుకునే కంబ్యాక్ ను సొంతం చేసుకున్న…

సన్నీ డియోల్ తో మైత్రి మూవీస్ వాళ్ళు భారీ బడ్జెట్ తో చేయగాజాట్(Jaat Movie) సినిమా ఆడియన్స్ ముందుకు 10న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి బజ్ నే సొంతం చేసుకున్నా కూడా ఆ ఇంపాక్ట్ అయితే అసలు సినిమా..

అడ్వాన్స్ బుకింగ్స్ మీద మినిమమ్ కూడా ఇంపాక్ట్ ఏమి చూపించ లేక పోతూ ఉండటం అందరినీ ఆశ్యర్యపరుస్తుంది ఇప్పుడు. సినిమా రిలీజ్ కి కొన్ని గంటల ముందు వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ లెక్క కేవలం 1.5 కోట్ల రేంజ్ లోనే ఉండగా సినిమా మీద…

భారీ ఆశలు పెట్టుకున్న అందరికీ ఇప్పుడు తీవ్రంగా నిరాశ పరిచే అడ్వాన్స్ బుకింగ్స్ తో షాకిచ్చింది జాట్ మూవీ, గదర్2 లాంటి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సినిమా తర్వాత సన్నీ డియోల్ నుండి వస్తున్న ఈ మాస్ మూవీ కమర్షియల్ గా బాగా వర్కౌట్ అవుతుంది అనుకున్నా…

ప్రస్తుతానికి అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం నిరాశ పరిచాయి. రవితేజ గోపీచంద్ మలినేని ల కాంబోలోనే ఈ సినిమా రూపొంది ఉంటే ఈ పాటికి బజ్ మరో లెవల్ లో రచ్చ లేపేది….కానీ ప్రస్తుతం సాలిడ్ కంబ్యాక్ ను అందుకున్న సన్నీ డియోల్ నుండి వస్తున్న…

జాట్ మూవీ మాత్రం ప్రస్తుతానికి బుకింగ్స్ పరంగా నిరాశ పరచగా ఇప్పుడు మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ కాబోతుంది అని చెప్పాలి. టాక్ బాగుంటే లాంగ్ వీకెండ్ లో ఓవరాల్ గా మంచి జోరు చూపించే అవకాశం ఉంది. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here