మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) తో అనుకున్న సినిమా తర్వాత అనుకోకుండా బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) నటించిన లేటెస్ట్ మూవీ జాట్(Jaat Movie) సినిమా గా మారి ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా గదర్2 తర్వాత…
సన్నీ డియోల్ కెరీర్ లో సెకెండ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. టోటల్ రన్ లో అల మోస్ట్ 89 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని మంచి జోరుని చూపించింది. సినిమా చూసిన టాలీవుడ్ ఆడియన్స్ అందరూ సినిమాలో రవితేజ…
కనిపించి యాక్ట్ చేసి ఉంటే ఇక్కడ మరింత రచ్చ చేసే మూవీ అని జాట్ కి ఉందని అనగా రీసెంట్ గా సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుని డిజిటల్ లో రిలీజ్ అయింది… నెట్ ఫ్లిక్స్ లో సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వగా అక్కడ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది ఆసక్తిగా మారగా…
అక్కడ సినిమా చూసిన ఆడియన్స్ అందరూ కూడా రవితేజ సినిమాలో యాక్ట్ చేసి ఉంటే కచ్చితంగా ఇంకా బెటర్ గా ఇక్కడ ఆడియన్స్ ను ఆకట్టుకునేదని, కానీ రవితేజ మిస్ అయినా కూడా బాలీవుడ్ అండ్ నార్త్ ఆడియన్స్ వరకు ఇలాంటి ఊరమాస్ యాక్షన్ రోల్ లో…
సన్నీ డియోల్ చాలా పవర్ ఫుల్ గా కనిపించారని, కథ పాయింట్ రొటీన్ గా అనిపించినా కూడా యాక్షన్ సీన్స్ అండ్ హీరోయిజం సీన్స్ ఓ రేంజ్ లో వర్కౌట్ అయ్యేలా సినిమా పర్వాలేదు ఒకసారి ఈజీగా చూసేలా ఉందని అంటున్నారు…
కొన్ని చోట్ల యాక్షన్ డోస్ మరీ ఓవర్ అయినట్లు అనిపించినా కూడా ఓవరాల్ గా మాత్రం ఇక్కడ ఆడియన్స్ రవితేజ ఉండి ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉండగా బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం సన్నీ డియోల్ ని ఈ రేంజ్ లో పవర్ ఫుల్ గా మరెవరూ చూపించలేదు అంటూ మెచ్చుకుంటున్నారు…