కోలివుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ధనుష్(Dhanush) అటు నటుడిగా నిర్మాతగా ఫుల్ బిజీగా ఉంటూనే ఈ మధ్య డైరెక్షన్ కూడా చేస్తూ ఉండగా లాస్ట్ ఇయర్ రాయన్ మూవీ తర్వాత ఇప్పుడు తన డైరెక్షన్ లో తన అక్క కొడుకు పవిష్ ను హీరోగా పరిచయం చేస్తూ డైరెక్ట్ చేసిన కొత్త సినిమా జాబిలమ్మ నీకు అంత కోపమా(Jaabilamma Neeku Antha Kopama Movie) ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ….
ముందుగా స్టోరీ పాయింట్ కి వస్తే అనుకోని కారణాల వలన తన ఫస్ట్ లవ్ ఫెయిల్ అవ్వడంతో హీరోకి ఇంట్లో పేరెంట్స్ పెళ్లి చేయాలని చూస్తారు…పెళ్లి కూతురు తన క్లాస్ మేట్ అవ్వడంతో తన లవ్ స్టోరీ గురించి తనతో చెబుతాడు హీరో, ఇంతలో తన ఎక్స్ కి పెళ్లి ఫిక్స్ అయిందని తెలుస్తుంది….తన లవ్ ఎందుకు ఫెయిల్ అయ్యింది…హీరో తర్వాత ఏం చేశాడు అన్నది మిగిలిన కథ…
కథ పాయింట్ గా చెప్పాలి అంటే ధనుష్ లవ్ స్టోరీ చాలా చాలా బేసిక్ గానే రాసుకున్నాడు, కానీ తెరకెక్కించిన విధానంలో ఎంటర్ టైన్ మెంట్ డోస్ ఎక్కడా తగ్గకుండా చూసుకోవడంతో లవ్ స్టోరీ డెప్త్ పెద్దగా లేదని పించినా కామెడీ ఎంటర్ టైన్ మెంట్ బాగా వర్కౌట్ అవ్వడంతో సినిమా పెద్దగా బోర్ కొట్టలేదు…
ధనుష్ అక్క కొడుకు పవిష్ తన రోల్ వరకు బాగా నటించాడు, కొన్ని సీన్స్ లో ధనుష్ లానే అనిపించాడు…ఇక అనిఖ సురేంద్రన్ పర్వాలేదు అనిపించగా..ప్రియ ప్రకాష్ వారియర్ చిన్న రోల్ లో మెప్పించింది…అందరినీ మించిపోతూ మలయాళ యాక్టర్ మాథ్యూ థామస్ తన కామెడీతో ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేశాడు…
సంగీతం పర్వాలేదు అనిపించగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మరీ ఫ్రెష్ గా ఏమి లేక పోయినా కూడా బోర్ అయితే పెద్దగా అనిపించలేదు…ఓవరాల్ గా ఫస్టాఫ్ లవ్ స్టోరీ ఓకే అనిపించినా కామెడీ అక్కడక్కడా పర్వాలేదు అనిపిస్తూ సెకెండ్ ఆఫ్ కథ మాత్రం కొన్ని చోట్ల కామెడీ హిలేరియస్ గా వర్కౌట్ అవ్వగా…
క్లైమాక్స్ పోర్షన్ ఒక పక్క సీరియస్ గా సాగినా మరో పక్క కామెడీ డైలాగ్స్ కూడా మెప్పించాయి…. ఓవరాల్ గా సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ ప్రజెంట్ జనరేషన్ యూత్ కి నచ్చే ఎలిమెంట్స్ సినిమాలో చాలానే ఉండటం, అవి చాలా వరకు వర్కౌట్ అవ్వడంతో…
ఈజీగా ఒకసారి చూసేలా మెప్పించింది అని చెప్పాలి జాబిలమ్మ నీకు అంత కోపమా గురించి, డైరెక్టర్ గా ధనుష్ లవ్ సీన్స్ ను అనుకున్న రేంజ్ లో తీయకున్నా కామెడీ అండ్ ఓవరాల్ గా మూవీ పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. లవ్ స్టోరీ కూడా మంచి డెప్త్ ఉండి ఉంటే సినిమా ఇంకా బాగా మెప్పించి ఉండేది..
పెద్దగా అంచనాలు ఏమి లేకుండా చూసే ఆడియన్స్, ధనుష్ డైరెక్షన్ లో మూవీ అన్న నమ్మకంతో వెళ్ళే ఆడియన్స్ అయినా చాలా వరకు సాటిస్ ఫై అయ్యే థియేటర్స్ నుండి బయటికి వస్తారు… ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్….