బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) నటించిన లేటెస్ట్ మూవీ జాక్(Jack Movie) తో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా అవ్వడంతో మినిమమ్ ఇంపాక్ట్ ని అయినా…
జాక్ మూవీ ఓపెనింగ్స్ లో చూపెడుతుంది అనుకున్నా కూడా ఏమాత్రం జోరుని చూపించలేక పోయింది. మొదటి రోజున కేవలం 31 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా….
2.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచింది….నైజాంలో పర్వాలేదు అనిపించినా మిగిలిన చోట్ల ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేదు. మొత్తం మీద మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 1.20 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా…
కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లు కలిపి సినిమా మరో 1.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద 70 లక్షల లోపే షేర్ మార్క్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కి గాను జాక్ మూవీ ఓవరాల్ గా…
3.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 1.90 కోట్ల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా సొంతం చేసుకుంది. టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇవి అస్సలు ఊహించని డే 1 కలెక్షన్స్ అనే చెప్పాలి. సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 18 కోట్ల రేంజ్ లో ఉండగా…
సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 16.10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా లాంగ్ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమైనా జోరు ని చూపెడుతుందో లేదో చూడాలి ఇప్పుడు.