Home న్యూస్ జాక్ మూవీ ట్రైలర్ రివ్యూ…సిద్ధూ మళ్ళీ గట్టిగా కొట్టేలా ఉన్నాడు!!

జాక్ మూవీ ట్రైలర్ రివ్యూ…సిద్ధూ మళ్ళీ గట్టిగా కొట్టేలా ఉన్నాడు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టిల్లు సిరీస్ తో సూపర్ సక్సెస్ లను సొంతం చేసుకున్న యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా అయిన జాక్(Jack movie) ఇప్పుడు…

ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు పెరిగిపోయేలా ఉండగా టిల్లు స్క్వేర్ తర్వాత మళ్ళీ డిఫెరెంట్ అటెంప్ట్ తో వస్తున్న….

జాక్ మూవీ ట్రైలర్ వరకు ఫుల్ మార్కులు కొట్టేసింది అని చెప్పాలి. మరోసారి సిద్ధూ జొన్నలగడ్డ మాస్ యాటిట్యూడ్ తో తనదైన డైలాగ్స్ తో ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాడు. సింగిల్ లైన్ పంచులు…కామెడీ సీన్స్ బాగానే వర్కౌట్ అవ్వగా ప్రకాష్ రాజ్ కూడా తనదైన స్టైల్ లో మెప్పించాడు.

ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టాప్ నాట్చ్ అనిపించేలా ఉండగా స్టోరీ పాయింట్ కూడా కొద్దిగా రివీల్ చేయగా కథ పాయింట్ ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని పట్టుకునే పనిలో ఉన్న ప్రకాష్ రాజ్ అండ్ టీం ని కాదని హీరో సీన్ లోకి ఎంటర్ అయ్యి ఆ క్రిమినల్ ను పట్టుకునే పనిలో ఉంటాడు…

ఈ విషయం తెలిసిన ప్రకాష్ రాజ్ ఏం చేశాడు ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మిగిలిన కథగా అనిపిస్తుంది. ఓవరాల్ గా ట్రైలర్ మెప్పించిన రేంజ్ లో సినిమా కూడా మెప్పిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న సిద్ధూ జొన్నలగడ్డ ఇప్పుడు ఈ సినిమాతో అంచనాలను అందుకుంటే మాత్రం తన రేంజ్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here