లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్ మూవీ తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అలాగే మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సక్సెస్ ను సొంతం చేసుకున్న సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ జాక్(Jack Movie) తో వచ్చేశాడు. టీసర్ ట్రైలర్స్ పర్వాలేదు అనిపించగా సినిమా ఇప్పుడు ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే బాగా చదివే హీరో రెగ్యులర్ జాబ్స్ కాకుండా డిఫెరెంట్ గా ట్రై చేద్దామని రా ఏజెంట్ అవ్వాలని అనుకుంటాడు. ఇంటర్వ్యూ ఇచ్చిన వెంటనే రిజల్ట్స్ అనౌన్స్ మెంట్ ముందే కేసులు సాల్వ్ చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగింది అన్నది అసలు కథ…
ఒకప్పుడు క్లాస్ మూవీస్ తో మంచి పేరు తెచ్చుకున్న బొమ్మరిల్లు బాస్కర్ చాలా టైం తర్వాత చేసిన జాక్ మూవీ కథ పరంగా చాలా బేసిక్ కథతో రాగా స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ కూడా పరమ బేసిక్ గానే ఉన్నాయని చెప్పాలి. దాంతో డైరెక్టర్ గా బొమ్మరిల్లు భాస్కర్ చాలా సీన్స్ లో అంచనాలను అందుకోలేదు..
కానీ అదే టైంలో సినిమాను నిలబెట్టడానికి హీరో సిద్ధూ జొన్నలగడ్డ ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు…కొంచం టిల్లు యాటిట్యూడ్ కంటిన్యూ అయినట్లు అనిపించినా సింగిల్ లైన్ పంచులు కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అవ్వగా యాక్షన్ పార్ట్ మాత్రం పెద్దగా సెట్ అవ్వలేదు అనిపించింది.
ఇక హీరోయిన్ వైష్ణవి ఈ రోల్ కి పెద్దగా సెట్ అవ్వలేదు అనిపించింది….మిగిలిన యాక్టర్స్ తమ రోల్స్ లో పర్వాలేదు అనిపించగా…సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ వీక్ గా ఉన్నాయి…ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రన్ టైం తక్కువే ఉన్నా కొంచం ఎక్కువగానే బోర్ అనిపించింది అని చెప్పాలి…
ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు…మొత్తం మీద బొమ్మరిల్లు బాస్కర్ అంచనాలను అందుకోలేక పోయాడు…క్లారిటీ లేని డైరెక్షన్ తో ఎటు నుండి ఎటో వెళుతూ సినిమాలో కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ ఇలా అనేక అంశాలను మిక్స్ చేసినా ఏది కూడా…
అనుకున్న రేంజ్ లో సెట్ కాలేక పోయింది. దాంతో కేవలం సిద్ధూ జొన్నలగడ్డ కోసం మాత్రం కొంచం ఓపిక చేసుకుని కూర్చుని చూస్తె ఓవరాల్ గా యావరేజ్ అనిపించవచ్చు కానీ ఓవరాల్ గా సినిమా వైజ్ చూస్తె మాత్రం బిలో పార్ అనిపించేలానే ఉంది. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.25 స్టార్స్…