బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ సమ్మర్ టైంలో మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు టిల్లు స్క్వేర్ సినిమాతో వచ్చి ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి సంచలన బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) నటించిన లేటెస్ట్ మూవీ జాక్(Jack Movie)తో ఆడియన్స్ ముందుకు….
ఈ సమ్మర్ లో వచ్చాడు కానీ మొదటి రోజే సినిమాకి సాలిడ్ డిసాస్టర్ టాక్ సొంతం అయ్యింది. దాంతో కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన సినిమా భారీ గా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది…
లాస్ట్ ఇయర్ వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో టోటల్ రన్ లో ఏకంగా 130 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాంటి రిజల్ట్ తర్వాత వచ్చిన జాక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
JACK Movie Total WW Collections
👉Nizam – 1.75Cr~
👉Ceeded – 45L
👉Andhra – 1.55CR~
AP-TG Total – 3.75CR~(8.30CR~ GROSS)
👉KA+ROI+OS- 1.30Cr***Approx
Total World Wide Collections: 5.05CR~(10.15CR Gross)
మొత్తం మీద సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 18 కోట్ల దాకా ఉండగా సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ తో 12.95 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని ఏకంగా డబుల్ డిసాస్టర్ గా రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇక అప్ కమింగ్ మూవీస్ సిద్ధు సాలిడ్ కంబ్యాక్ ను ఏ సినిమాతో సొంతం చేసుకుంటాడో చూడాలి.