Home గాసిప్స్ భలే మోసం చేశారు….నెట్ ఫ్లిక్స్ కి నష్టం…మేకర్స్ కి ఎంత లాభం అంటే!

భలే మోసం చేశారు….నెట్ ఫ్లిక్స్ కి నష్టం…మేకర్స్ కి ఎంత లాభం అంటే!

1

కొన్ని సినిమాలు రిలీజ్ కి ముందు విపరీతమైన హైప్ ను సొంతం చేసుకుంటాయి కానీ రిలీజ్ అయ్యాక ఆ అంచనాలకు సరిపడా స్టఫ్ సినిమాలో లేక పొతే తీవ్ర విమర్శలను సొంతం చేసుకోవడం ఖాయం. ఇలా చాలా సినిమాలే బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇక రీసెంట్ టైం లో డిజిటల్ రిలీజ్ అవుతున్న సినిమాల విషయం లో కూడా ఇదే జరుగుతుంది. భారీ రేట్లు పెట్టి కొనడానికి ముందుకు వస్తున్న…

OTT యాప్స్ కొన్ని సార్లు మాత్రమే సినిమా మొత్తం చూసిన తర్వాత కొనాలో వద్దో అన్న నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కానీ మేకర్స్ తెలివిగా మారి మీరు సినిమా చూసి వద్దు అంటే అప్పుడు కథ లీక్ అవుతుంది కాబట్టి సినిమాను చూపెట్టం అంటూ చెబుతున్నారు ఈ మధ్య. దాంతో రేటు ఎక్కువ పెట్టి…

కొంటున్నా కానీ సినిమాలను చూడకుండానే రైట్స్ ని కొని రిలీజ్ చేస్తున్నాయి OTT యాప్స్. ఈ అడ్వాంటేజ్ ను బాగా వాడుకున్న సినిమాలు లాస్ట్ ఇయర్ వి ది మూవీ కాగా ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన ధనుష్ జగమే తంత్రం మరోటి అని చెప్పొచ్చు.

సినిమా రిలీజ్ కి ముందు ఉన్న హైప్ తో రేటు పెంచుతూ పోయిన మేకర్స్ ఫైనల్ గా సాలిడ్ రేటు అనిపించిన తర్వాత సినిమాను అమ్ముతున్నారు. వి మూవీ లో ఇదే జరిగి ముందు ఒక రేటు అనుకుని తర్వాత హైప్ ఉంది రేటు పెంచండి అంటూ దిల్ రాజు భారీ మొత్తం తీసుకోగా జగమే తంత్రం సినిమా మొదటి నుండి హైప్ పెంచారు. ముందు 35 కోట్ల రేంజ్ లో ఉన్న రేటు ని…

హైప్ పెంచి పెంచీ ఏకంగా 60 కోట్లకు తెగేలా చేశారు మేకర్స్… బాక్స్ ఆఫీస్ బిజినెస్ కూడా 40 కోట్ల లోపే అన్ని చోట్ల కలిపి సొంతం చేసుకునే అవకాశం ఉండేది, కానీ డైరెక్ట్ రిలీజ్ వలన 60 కోట్లకు అమ్మి 20 కోట్ల సాలిడ్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్నాడట నిర్మాత. ఈ న్యూస్ ఇప్పుడు కోలివుడ్ లో చక్కర్లు కొడుతుంది. దాంతో నెట్ ఫ్లిక్స్ కి నష్టం రాగా నిర్మాత మాత్రం ఫుల్ ప్రాఫిట్స్ లో ఉన్నారని అంటున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here