Home న్యూస్ ఈ విజువల్స్ ఏంటి ఈ బడ్జెట్ ఏంటి…..సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్!!

ఈ విజువల్స్ ఏంటి ఈ బడ్జెట్ ఏంటి…..సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్!!

2036
0

కన్నడ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో శివరాజ్ కుమార్ ఒకరు… డిఫెరెంట్ జానర్ మూవీస్ ని ట్రై చేస్తూ ఆడియన్స్ ను అలరించే ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ భజరంగి 2… ఈ సినిమా పై కన్నడ లో మంచి అంచనాలు ఉండగా సినిమా ఆడియన్స్ ముందుకు ఈ నెల 29 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ను తెలుగు లో కూడా డబ్ చేసి ఇప్పుడు….

అదే రోజున ఆడియన్స్ ముందుకు ఇక్కడ జై భజరంగి పేరు తో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా ట్రైలర్ సినిమా పై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేయగా ట్రైలర్ కి యూట్యూబ్ లో ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది…

సినిమా ట్రైలర్ కి ఇప్పటి వరకు 2 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం, ఇక ట్రైలర్ క్వాలిటీ కానీ విజువల్స్ కానీ స్టార్ కాస్ట్ కానీ టాప్ నాట్చ్ అనిపించే విధంగా ఉండగా హై స్టాండర్డ్స్ లో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ బడ్జెట్ ఇప్పుడు అందరికీ శాకిస్తుంది…

ఈ రేంజ్ క్వాలిటీ తో సినిమా నిర్మాణం అవ్వాలి అంటే మినిమం 30-40 కోట్ల రేంజ్ బడ్జెట్ కచ్చితంగా పెట్టి తీరాల్సిందే. కానీ ఈ సినిమా ను కన్నడలో 15-16 కోట్ల మధ్యలోనే కంప్లీట్ చేశారట. హీరో రెమ్యునరేషన్ తీసుకోలేదట. సినిమా టోటల్ బిజినెస్ అయ్యాక ప్రాఫిట్ షేర్ తీసుకుంటానని చెప్పడంతో ఇతర స్టార్ కాస్ట్ కి అండ్ సినిమా షూటింగ్ మొత్తం కూడా 16 కోట్ల లోపే పూర్తీ అయ్యిందని అంటున్నారు.

కానీ సినిమా ట్రైలర్ లో విజువల్స్ చూస్తుంటే అసలు ఈ రేంజ్ క్వాలిటీ ఫిల్మ్ అంత తక్కువ బడ్జెట్ లో ఎలా అయ్యిందో అని అందరూ ఆశ్యర్యపోతున్నారు. ట్రైలర్ లాంచ్ తర్వాత తెలుగు లో కూడా డీసెంట్ బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఇక సినిమా బిజినెస్ అండ్ థియేటర్స్ కౌంట్ వివరాలు త్వరలో అప్ డేట్ చేస్తాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here