Home న్యూస్ విజువల్ వండర్ “జై భజరంగి” తెలుగు బిజినెస్ థియేటర్స్ కౌంట్!!

విజువల్ వండర్ “జై భజరంగి” తెలుగు బిజినెస్ థియేటర్స్ కౌంట్!!

2574
0

రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమా పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసుకున్న సినిమా జై భజరంగి, కన్నడలో భజరంగి 2 పేరుతో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత విజువల్స్ చూసి ఈ రేంజ్ క్వాలిటీ ఏంటి అంటూ అందరూ నోళ్ళు వెల్లబెట్టారు. ఆ రేంజ్ లో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా కన్నడ తో పాటు తెలుగు లో కూడా ఇప్పుడు ఈ శుక్రవారం రిలీజ్ ను…

సొంతం చేసుకోబోతుండగా తెలుగు లో సినిమాను బాగానే రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు. తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా ఈ సినిమా 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా అందులో నైజాంలో 70 థియేటర్స్ లో, సీడెడ్ లో 35 థియేటర్స్ లో టోటల్ ఆంధ్రలో 90 థియేటర్స్ లో….

రిలీజ్ కి సిద్ధం అయిన ఈ సినిమా ఓవరాల్ గా మంచి థియేటర్స్ కౌంట్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి… ఇక సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 70 లక్షల రేంజ్ లో బిజినెస్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుందని సమాచారం, దాంతో ఇక్కడ సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ కోసం…

1 కోటి లోపు షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సి ఉంటుంది… సినిమా విజువల్స్ ఎక్స్ లెంట్ అనిపించే విధంగా ఉండటం తో సినిమా కి టాక్ పాజిటివ్ గా ఉంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా కన్నడ లో మొత్తం మీద 11 కోట్ల రేంజ్ లో…

ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుందని అక్కడ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా కన్నడ లో భారీగా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా గ్రాండ్ ఓపెనింగ్స్ ఖయామని నమ్మకంగా ఉన్నారు. తెలుగు లో 2 కొత్త సినిమాల మధ్య పోటి లో ఈ సినిమా ఇక్కడ ఎలాంటి రిజల్ట్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here