తమిళ్ తో పాటు తెలుగు వారికి కూడా సుపరిచితుడు అయిన సూర్య నటించిన లేటెస్ట్ మూవీ జై భీమ్ థియేట్రికల్ రిలీజ్ ను ముందే కాన్సిల్ చేసుకుని ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవ్వగా సినిమా రిలీజ్ డేట్ ను దీపావళి టైం లో ఉంటుందని ముందే అనౌన్స్ చేయగా ఇప్పుడు సినిమాను నవంబర్ 2 న డైరెక్ట్ రిలీజ్ చేయడానికి అమెజాన్ ప్రైమ్ ప్రమోషన్స్ ను…
మొదలు పెట్టగా అందులో భాగంగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ బాగా ఇంప్రెస్ చేసేలా ఉండగా సీరియస్ స్టొరీ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అణగారిన తక్కువ జాతి కులాలకు చెందిన వాళ్ళని సమాజంలో ఎలా చూస్తున్నారు. వాళ్ళపై పోలీసులు…
కొందరు కావాలని పెండింగ్ పెసులను పెట్టి వాళ్ళని ఒప్పించడానికి ఎలా హింసాత్మకంగా వ్యవహరిస్తారు, వాళ్ళకి తనవంతుగా న్యాయం చేయాలని ఒక సిన్సియర్ లాయర్ అయిన హీరో ఏం చేశాడు, ఆయన్ను అడ్డుకోవడానికి చూసిన వాళ్ళని ఎదురించి తను అనుకున్నది ఎలా సాధించాడు అన్నది మొత్తం మీద సినిమా కథగా చూపెట్టారు.
సీరియస్ నోట్ తో సాగిన ట్రైలర్ అందరి పెర్ఫార్మెన్స్ మెప్పించేలా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచింది. కానీ సూర్య తెలుగు డబ్బింగ్ ఏమాత్రం సెట్ కాలేదు అనిపించింది, అండ్ ఓవర్ తమిళ్ ఫ్లేవర్ ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది, కాన్సెప్ట్ రియల్ ఇంసిడెంట్స్ ని బేస్ చేసుకుని తెరకెక్కించిన కథ అని అంటూ ఉండటంతో సినిమా ఎలా ఉంటుందో అన్నది ఆసక్తిగా మారగా…
ఆకాశం నీ హద్దురా లాంటి డిజిటల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూర్య నుండి వస్తున్న సినిమా అవ్వడంతో తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తుండగా సినిమాను హిందీలో కూడా డబ్ చేసి ఒకేసారి మూడు భాషల్లో డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారు. మరి సినిమా నవంబర్ 2 న రిలీజ్ అయ్యాక ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.