Home న్యూస్ సైలెంట్ రిలీజ్ అయినా రికార్డుల దుమ్ము దులిపెసిన సూర్య “జై భీమ్”!!

సైలెంట్ రిలీజ్ అయినా రికార్డుల దుమ్ము దులిపెసిన సూర్య “జై భీమ్”!!

2865
1

లాస్ట్ ఇయర్ సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా డిజిటల్ లో రిలీజ్ అయిన టైం లో రెస్పాన్స్ మరో లెవల్ లో ఉండేది, రిలీజ్ కి ముందు రిలీజ్ తర్వాత సినిమా కి అల్టిమేట్ రివ్యూలు దక్కడంతో చూడని వాళ్ళు కూడా డిజిటల్ లో సినిమాను చూడటానికి ఎగబడ్డారు… ఆ సినిమా తో కంపేర్ చేసి చూస్తె సూర్య లేటెస్ట్ మూవీ జై భీమ్ రిలీజ్ టైం లో పెద్దగా…

హడావుడి అయితే ఏమి లేదనే చెప్పాలి, సైలెంట్ గానే రిలీజ్ అయ్యింది ఈ సినిమా, రెగ్యులర్ మూవీ కాక పోవడం, కమర్షియల్ ఎలిమెంట్స్ లేక పోవడంతో తమిళ్ లో కూడా సూర్య ఆకాశం నీ హద్దురాతో పోల్చితే పెద్దగా హైప్ ఏమి రాలేదు… కానీ సినిమా ఆడియన్స్ ముందుకు…

డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత రివ్యూలు అద్బుతంగా వచ్చాయి ఈ సినిమా కి, కొంచం స్లో అయినా ఎంచుకున్న పాయింట్ అద్బుతంగా ఉండటంతో చూసిన ప్రతీ ఒక్కరూ ఓ మంచి సినిమా చూశాం అంటూ సోషల్ మీడియాలో మెచ్చుకున్నారు. దాంతో రిలీజ్ టైం లో సైలెంట్ గానే బరిలోకి దిగినప్పటికీ కూడా…

రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ అదిరి పోవడంతో వ్యూస్ ఓ రేంజ్ లో పెరిగిపోయాయి అంట ఈ సినిమాకి, ప్రైమ్ వీడియో వాళ్ళు ఇంకా అఫీషియల్ గా లెక్కలు చెప్పాల్సి ఉన్నప్పటికీ ఆకాశం నీ హద్దురా సినిమా తర్వాత ఓవరాల్ గా సౌత్ మొత్తం మీద హైయెస్ట్ వ్యూవర్ షిప్ ను ఈ సినిమా వీకెండ్ లో సొంతం చేసుకుందని అంటున్నారు.

అన్ని భాషల్లో డబ్ అయ్యి రిలీజ్ అవ్వడంతో రెస్పాన్స్ అదిరిపోయిందని అంటున్నారు. సినిమా కి పెట్టిన రేటు కి ఫుల్ న్యాయం చేస్తూ టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దూసుకు పోతున్న జై భీమ్ సినిమా తెలుగు లో కూడా అద్బుతమైన వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుందట. అఫీషియల్ లెక్కలు ఎన్ని మిలియన్స్ లో ఉంటాయో అప్ డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్ డేట్ చేస్తాం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here