Home న్యూస్ జైలర్ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

జైలర్ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నుండి ఆడియన్స్ ముందుకు భారీ అంచనాలతో వచ్చిన కొత్త సినిమా జైలర్(Jailer) 2 సాంగ్స్ ఒక్క ట్రైలర్ అంచనాలను పీక్స్ కి వెళ్ళేలా చేసిన జైలర్ మూవీ అద్బుతమైన బజ్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే…. రిటైర్ అయిన తర్వాత తన ఫ్యామిలీతో సంతోషంగా ఉండే హీరో లైఫ్ లో అనుకోకుండా ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య వల్ల అసలు ఎవరు, అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి…విలన్స్ తో గొడవకి కారణం ఏంటి….ఆ తర్వాత కథ ఎలా ఉంది లాంటి విశేషాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

స్టోరీ పాయింట్ చాలా బేసిక్ గా ఉంటుంది, కానీ రజినీ మాస్ స్వాగ్ అండ్ ఎలివేషన్ సీన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉండటం మేజర్ ప్లస్ పాయింట్. రజినీ పెర్ఫార్మెన్స్, మాస్ సీన్స్, స్వాగ్ అన్నీ అద్బుతంగా సెట్ అయ్యాయి… మిగిలిన రోల్స్ చాలానే ఉన్నప్పటికీ రజినీ అందరినీ ఫుల్ డామినేట్ చేశాడు… మిగిలిన రోల్స్ పర్వాలేదు అనిపించేలా నటించగా… యోగిబాబు కామెడీ బాగానే మెప్పించింది అని చెప్పాలి.

Jailer Telugu Review Plus minus Points
సినిమా కి సెకెండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్… ఎలివేషన్ సీన్స్ కి అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ లో రాంపేజ్ క్రియేట్ చేసేలా ఉంటుంది, హుకుం సాంగ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది… ఇంటర్వెల్ సీన్, ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ కి అనిరుద్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి… 

డైరెక్టర్ నెల్సన్ చాలా సింపుల్ స్టోరీ ని తీసుకోగా ఫస్టాఫ్ టేక్ ఆఫ్ కి కొంచం టైం తీసుకుని ఫ్యామిలీ సీన్స్ లో లైట్ కామెడీ తో పర్వాలేదు అనిపించి తర్వాత అసలు కథలోకి వెళ్ళాడు. అక్కడ పెద్దగా బోరింగ్ సీన్స్ ఏమి పడలేదు కానీ కొంచం ఫ్లాట్ గా కథ వెళుతుంది, ఆ టైంలో ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ ఎపిసోడ్ అద్బుతంగా సెట్ అవ్వగా…

సెకెండ్ ఆఫ్ పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోతాయి. ఆ అంచనాలను ఏమాత్రం తీసిపోని విధంగా సెకెండ్ ఆఫ్ ఫస్ట్ 25-30 నిమిషాల కథ సేమ్ టెంపోని మెయిన్ టైన్ చేస్తుంది, కానీ ఆ తర్వాత కథ మాత్రం ఒక్క సారిగా స్లో డౌన్ అయిపోయి ఫ్లాట్ నరేషన్ తో సాగగా మళ్ళీ క్లైమాక్స్ లో స్పెషల్ క్యామియోలతో బాగానే మెప్పించినా ఇంటర్వెల్, ఇంటర్వెల్ తర్వాత ఎపిసోడ్స్ రేంజ్ కిక్ ఇవ్వదు…

అయినా కానీ సీన్స్ వైజ్, కామెడీ పార్ట్ వైజ్, హీరో ఎలివేషన్స్ వైజ్ ఇలా చాలా సీన్స్ ను పార్టు పార్టులుగా బాగా తీశాడు డైరెక్టర్… కానీ ఓవరాల్ స్టోరీ పాయింట్ చాలా సింపుల్ గా ఉండటం, సెకెండ్ ఆఫ్ ఒక దశ దాటాక కథ చాలా స్లోగా మారిపోవడం, క్లైమాక్స్ ఊహించినట్లే ఉండటం సినిమా కి మేజర్ మైనస్ పాయింట్స్… అలాగే లెంత్ కూడా కొంచం ఎక్కువ అయినట్లు అనిపించింది…

ఈ సీన్స్ ని కూడా మిగిలిన సీన్స్ లా తీసి ఉంటే సినిమా రేంజ్ ఎక్కడో ఉండేదని చెప్పొచ్చు… ఓవరాల్ గా నెల్సన్ డైరెక్ట్ చేసిన మూవీస్ లో బీస్ట్ కన్నా చాలా బెటర్ గా జైలర్ ఉండగా డాక్టర్ టాప్ లో ఉంటుందని చెప్పొచ్చు. రజినీ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన ఈ సినిమా మిగిలిన ఆడియన్స్ కి ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here