Home న్యూస్ “జల్లికట్టు” మూవీ రివ్యూ….ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చూసి ఉండరు!!

“జల్లికట్టు” మూవీ రివ్యూ….ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చూసి ఉండరు!!

5073
0

ప్రతీ మనిషి లో ఒక మృగం ఉంటుంది, కానీ అది పరిస్థితి ని బట్టి ఎప్పుడో ఒకసారి లేదా కొన్ని సార్లు వచ్చి వెళుతూ ఉంటుంది, కానీ ఒక సమూహం మొత్తాని కలిసి మృగాలుగా ప్రవర్తిస్తే ఏమవుతుంది అన్నది ఈ సినిమా లో చూపిస్తారు, క్లైమాక్స్ ఎపిసోడ్ చూస్తుంటే మన లో కూడా ఇలాంటి ప్రవర్తన ఉంటుందా అని అనిపించేంత నాచురల్ గా సినిమా ను తెరకెక్కించారు ఈ సినిమా యూనిట్.

మలయాళం లో ఈ ఏడాది రిలీజ్ అయ్యి ప్రతీ ఒక్కరి చేత ప్రశంసల జల్లు కురిపించుకున్న ఈ సినిమా తెలుగు లో డబ్ చేసి రీసెంట్ గా రిలీజ్ చేశారు, మరి సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే…

ముందే చెప్పినట్లు మనిషి విచక్షణ కోల్పోయి మృగం లా ప్రవర్తించడం అనేది మెయిన్ కాన్సెప్ట్, దానికి అల్లు కున్న కథ ఒక భీఫ్ వ్యాపారీ అడవిలో ఉండే దున్నలను తెచ్చి చంపి ఊరికి భీఫ్ కూర అమ్ముతాడు, కానీ అనుకోకుండా ఒకసారి అడవి నుండి తెచ్చిన దున్న తప్పించుకుని ఊరంతటిని అడవిగా భావించి…

ఇష్టం వచ్చినట్లు తన కొమ్ములతో పొడవడం, షాపులు, బ్యాంకులు ద్వంసం చేయడం చేస్తుంది, దాంతో ఆ రోజు రాత్రి ఆ దున్న ని చంపాలని ఊరు ఊరంతా సిద్ధం అవుతారు, మరి ఆ దున్న ని చంపారా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… చాలా సింపుల్ కథగా అనిపించినా కన్విన్సింగ్ గా సినిమా ను తెరకెక్కించడం చాలా కష్టం…

కానీ అది చేసి చూపారు… ఫస్టాఫ్ వరకు కథ చాలా ఆసక్తిగా సాగగా సెకెండ్ ఆఫ్ కథ రిపీటివ్ గా అనిపిస్తుంది, కొన్ని అనవసరపు సీన్స్ ని కూడా పెట్టి కొద్దిగా బోర్ కూడా కొట్టించారు కానీ వాటిని మరిపించే విధంగా సౌండ్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో మెప్పిస్తాయి.

ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాలో కూడా ఇలాంటి కాన్సెప్ట్ ని కానీ సౌండింగ్ ని కానీ చూడటం వినడం లాంటివి చేసి ఉండరు, ముఖ్యంగా సౌండ్స్ అద్బుతంగా మెప్పించి సినిమా ఫీల్ ని మరో లెవల్ కి తీసుకెళ్ళేలా చేస్తుంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు ఆకట్టుకోగా…

సెకెండ్ ఆఫ్ గాడి తప్పుతుంది, సినిమా డైరెక్షన్ కూడా ఫస్టాఫ్ మెప్పించినంతగా సెకెండ్ ఆఫ్ మెప్పించదు, సీన్స్ రిపీటివ్ గా అనిపించడం దీనికి కారణం, ఇదొక్కటి పక్కకు పెడితే తర్వాత క్లైమాక్స్ ఎలా ఉంటుంది అని అంతా అనుకుంటున్న టైం లో అంచనాలకు మించి క్లైమాక్స్ లో మనుషులు పశువులుగా ప్రవర్తించడం షాక్ కి గురి అయ్యేలా చేస్తుంది.

మొత్తం మీద సినిమా ను డిఫెరెంట్ కాన్సెప్ట్ కోసం, అల్టిమేట్ సౌండింగ్ కోసం, కొన్ని ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమాటిక్ షాట్స్ కోసం చూడొచ్చు. రొటీన్ మూవీస్ చూసే వారికి సినిమా ఒకసారి చూడొచ్చు అనిపించే విధంగా ఉంటుంది, కొత్త కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే వారికి సినిమా ఇబో యావరేజ్ రేంజ్ లో ఉంటుంది.

అయినా కానీ మనిషి లో దాగి ఉండే ఈ పశు ప్రవుర్తి గురించి తెలుసుకుని దానికి దూరంగా ఉండాలి… ఆ పాయింట్ ని బేస్ చేసుకుని తీసిన సినిమా కచ్చితంగా ఒకసారైన చూసి తీరాల్సిందే. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 3 స్టార్స్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here