జాంబిల నేపధ్యంలో టాలీవుడ్ లో తెరకెక్కిన మొట్ట మొదటి సినిమా జాంబి రెడ్డి, జాంబిల కాన్సెప్ట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించి రాయలసీమ నేపధ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ ను బాగానే మెప్పించింది, బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి వీక్ లోనే బ్రేక్ ఈవెన్ తో పాటు ప్రాఫిట్స్ లో కూడా ఎంటర్ అవ్వగా…
తర్వాత కొత్త సినిమాల కోసం థియేటర్స్ ని కోల్పోతూ వచ్చిన సినిమా కలెక్షన్స్ పరంగా అది ఇంపాక్ట్ చూపింది, అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పటికే లాభాలను సొంతం చేసుకోవడంతో సినిమా మంచి ప్రాఫిట్స్ తో పరుగును బాక్స్ ఆఫీస్ దగ్గర ముగించింది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగు పూర్తీ అయ్యే టైం కి రెండు తెలుగు రాష్ట్రాలలో 6.10 కోట్ల షేర్ ని, వరల్డ్ వైడ్ గా 6.65 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని మంచి లాభాలను సొంతం చేసుకుంది. ఒకసారి ఏరియాల వారి గా సినిమా కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.98Cr
👉Ceeded: 1.16Cr
👉UA: 69L
👉East: 51L
👉West: 39L
👉Guntur: 52L
👉Krishna: 52L
👉Nellore: 33L
AP-TG Total:- 6.10CR (10.95Cr Gross~)
KA+ROI – 22L
Os – 33L
Total WW: 6.65CR(12Cr Gross~)
ఇదీ మొత్తం మీద పరుగు కంప్లీట్ అయ్యే టైం కి సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్… కొత్త సినిమాల పోటి వలన థియేటర్స్ ని ఎక్కువగా కోల్పోవడం వలన పరుగు త్వరగానే ముగించిన సినిమా అలా జరగక పోయి ఉంటె మరింత బాగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండేది.
సినిమాను టోటల్ గా 4.5 కోట్ల రేంజ్ రేటు కి బాక్స్ ఆఫీస్ దగ్గర అమ్మగా సినిమా 5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది, రన్ కంప్లీట్ అయ్యే టైం కి సినిమా 1.65 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఈ కాన్సెప్ట్ తో తెలుగు వచ్చిన మొదటి సినిమాగా అలాగే హిట్ అయిన సినిమాగా కూడా నిలిచింది ఈ సినిమా..